తెలంగాణలో కొత్త జిల్లాల ముసాయిదాపై వివిధ వర్గాల ప్రజల నుంచి భారీగా అభ్యంతరాలు సూచనలు వచ్చాయి. ఒక్కరోజులోనే తెలంగాణ ప్రభుత్వానికి సుమారు 555 విజ్ఞప్తులు అందాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం జిల్లాల ఏర్పాటుపై 333, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై 113, మండలాల ఏర్పాటుపై 109 అభ్యంతరాలు, సూచనలు వచ్చాయి. జిల్లాల వారీగా అందిన సూచనలు ఇలా ఉన్నాయి...