వరంగల్‌ ఆర్టీఏలోనే హన్మకొండ కార్యాలయం | HANMAKONDA OFFICE WILL BE LOCATED IN WARANGAL RTA | Sakshi
Sakshi News home page

వరంగల్‌ ఆర్టీఏలోనే హన్మకొండ కార్యాలయం

Published Thu, Sep 1 2016 12:04 AM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM

HANMAKONDA OFFICE WILL BE LOCATED IN WARANGAL RTA

ఖిలావరంగల్‌ : జిల్లాల పునర్విభజనతో వరంగల్‌ ఆర్టీఏ కార్యాలయం నాలుగు ముక్కలుగా చీలనుంది. కొత్తగా మూడు జిల్లాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేయాలి. వరంగల్‌ ఆర్టీఏ కార్యాలయాన్ని విభజించి, ఇక్కడ ఉన్న 50 మంది సిబ్బందిని నాలుగు జిల్లాల్లో సర్దుబాటు చేయాలి. మూడు జిల్లాల్లో ఆర్టీఏ కార్యాలయాల ఏర్పాటుకు డీటీసీ శివలింగయ్య  ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు.  ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తి చేశారు. వరంగల్‌లోని ఉప రవాణాశాఖ భవనంలోనే తాత్కాలికంగా వరంగల్, హన్మకొండ జిల్లాల ఆర్టీఏ కార్యాలయాలు కొనసాగనున్నాయి.  పై అంతస్తులో హన్మకొండ, గ్రౌండ్‌ఫ్లోర్‌లో వరంగల్‌ కార్యకలాపాలు సాగించనున్నారు. భూపాలపల్లిలో కొత్త కార్యాలయం ఏర్పాటు చేస్తుండ గా మహబూబాబాద్‌లో ఉన్న  సబ్‌ కార్యాల యాన్ని జిల్లా కార్యాలయంగా మార్చాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఒక ఆర్టీఓ ఉండగా మ రో ముగ్గురు రానున్నారు. నాలుగు జిల్లాల్లో  84 మంది సిబ్బంది ఆవసరం. ప్రస్తుతం వరంగల్‌ ఆర్టీఏ పరిధిలో 50 మంది ఉన్నారు. మరో 34 పోస్టుల్లో ఖాళీలు ఏర్పడనున్నాయి.  ఉన్న వారిలో 19 మందిని వరంగల్, 9 మంది హన్మకొండ, 12 మంది భూపాలపల్లి, 10 మందిని మహబూబాబాద్‌కు కేటాయించారు. జిల్లాలో ముగ్గురు ఎంవీఐలు ఉండగా వరంగల్, మహబూబాబాద్, భూపాలపల్లికి, ఏడుగురు ఏఎంవీఐలలో నలుగురు జిల్లా చెక్‌ పోస్ట్‌ వద్ద, మిగిలిన ముగ్గురిని వరంగల్, భూపాలపల్లి, మహబూబాబాద్‌కు కేటాయించారు. ఇద్దరు పరిపాలన «అధికారులు ఉండగా  భూపాలపల్లి, వరంగల్‌ జిల్లాలకు కేటాయించారు. జనగామలోని ఆర్టీఏ సబ్‌ కార్యాలయాన్ని యథావిధిగా నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. వాహనదారుల సౌకర్యార్థం భూపాలపల్లి జిల్లా ఏర్పాటుకు ముందే అక్కడ సబ్‌ కార్యాలయం ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. మరో వారం రోజుల్లోనే ఆ కార్యాలయం ప్రారంభమయ్యే ఆవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.
 
నాలుగు జిల్లాల పర్యవేక్షక అధికారిగా డీటీసీ..
 
వరంగల్‌ డిప్యూటీ ట్రాన్స్‌ఫోర్ట్‌ కమిషనర్‌ కార్యాలయం యథావిధిగా కొనసాగనుంది. కొత్తగా ఏర్పడనున్న నాలుగు జిల్లాల పర్యవేక్షణ ఆధికారిగా డీటీసీ ఉండనున్నారు. ఆదేవి«««దlంగా కరీంనగర్, ఖమ్మం జిల్లాల పర్యవేక్షణ అధికారిగా వ్యవహరించనున్నట్లు తెలిసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement