TRS district President
-
‘దేశ భవిష్యత్తు కోసం.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలి’
సాక్షి, హైదరాబాద్: దేశ బంగారు భవిష్యత్తు కోసం తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ఆపార్టీ జిల్లా అధ్యక్షులు ముక్తకంఠంతో కోరారు. దేశంలో మోదీ సారథ్యంలోని రాక్షసపాలన అంతం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ఉద్యమించి సాధించడంతో పాటు ఏ విధంగానైతే అభివృద్ధి చేశారో, ఆ విధంగా దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడేందుకు జాతీయ పార్టీ ఏర్పాటు చేసి, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న 21 మంది టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు శుక్రవారం తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిందిగా సీఎం కేసీఆర్‌ను కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ మేరకు జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. కావాలి కేసీఆర్.. రావాలి కేసీఆర్ బీజేపీ ముక్త్ భారత్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమని దేశ ప్రజలు భావిస్తున్నారని బాల్క సుమన్ చెప్పారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యమై రాజకీయ శూన్యత ఏర్పడిందని, ఈ పరిస్థితుల్లో కేసీఆర్‌తో ప్రత్యామ్నాయ శక్తి ఏర్పాటవుతుందని అన్ని రాష్ట్రాల నేతలు, ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. ప్రధాని మోదీ పాలన లో దేశంలోని ఏ వర్గానికీ మేలు జరగడం లేదని జీవన్‌రెడ్డి విమర్శించారు. రైతులు, యువత, మహి ళలు, దళిత, బలహీన వర్గాలకు చెందిన వారంతా కేసీఆర్‌ను కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ తరహా అభివృద్ధి కోసం దేశ ప్రజలంతా చూస్తున్నా రని చెప్పారు. కావాలి కేసీఆర్.. రావాలి కేసీఆర్ అని ప్రజలు అంటున్నారని తెలిపారు. దేశంలో ఫెడరల్ వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం నాశనం చేసిందని లింగయ్య యాదవ్ విమర్శించారు. జిల్లాల పార్టీ అధ్యక్షులే కాదని, అన్ని స్థాయిల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ జాతీయ రాజకీ యాల్లోకి రావాలని కోరుతున్నారని తెలిపారు. తెలంగాణపై మోదీ సర్కారు కుట్ర అమిత్ షా ఆగడాలకు అడ్డుకట్ట పడాలన్నా, మోదీ మెడలు వంచాలన్నా కేసీఆర్‌తోనే సాధ్యమని మాలోత్ కవిత చెప్పారు. దేశ ప్రజలంతా ఆయన రాకకోసం ఎదురుచూస్తు న్నారని అన్నారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ పట్ల మోదీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చారని ధ్వజమెత్తారు. దేశాన్ని మోదీ బ్రష్టు పట్టించారని, ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కేసీఆర్ నాయకత్వం చాలా అవసరమని మాగంటి గోపీనాథ్ పేర్కొన్నారు. తెలంగాణ పథకాలు దేశమంతా అమలు కావాలంటే కేసీఆర్‌తోనే సాధ్యమని, ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని పద్మాదేవేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజలంతా సీఎం కేసీఆర్ వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని చింతా ప్రభాకర్ చెప్పారు. ప్రజల ఆకాంక్ష మేరకు కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని దాస్యం వినయ్ భాస్కర్ విజ్ఞప్తి చేశారు. ఒక విజన్ ఉన్న నాయకుడి కోసం దేశమంతా ఎదురుచూస్తున్నదని గువ్వల బాలరాజు పేర్కొన్నారు. దేశానికి కేసీఆర్ అవసరం ఉంది దేశానికి ప్రస్తుతం కేసీఆర్ అవసరం ఎంతో ఉందని, ఆయన దేశాన్ని పాలించాలని కోరుకంటి చందర్ పేర్కొన్నారు. దేశాభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని సంపత్‌రెడ్డి అన్నారు. దేశాన్ని ఆవహించిన చీకటిని తొలగించే కాంతి రేఖ సీఎం కేసీఆర్ అని తాత మధు చెప్పారు. ఎంతో దూరదృష్టి కలిగిన సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి రావాలని శంభీపూర్ రాజు అన్నారు. యావత్ దేశం కేసీఆర్ కోసం తెలంగాణ వైపు చూస్తున్నదని ఆరూరి రమేశ్ పేర్కొన్నారు. పీవీ తర్వాత దేశానికి మరోసారి ప్రధానమంత్రిని అందించాలని కరీంనగర్ ఎదురు చూస్తోందని, కేసీఆర్ దేశానికి దారి చూపాలని జీవీ రామకృష్ణారావు చెప్పారు. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ముజీబ్, తోట ఆగయ్య తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఇదీ చదవండి: పాన్ ఇండియా పార్టీ.. దరసరాకు విడుదల! -
అంచనాలు తారుమారు.. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల ఎంపికలో ఊహించని మలుపు
సాక్షి, నల్లగొండ: టీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షునిగా దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ నియమితులయ్యారు. సూర్యాపేట జిల్లా అధ్యక్షునిగా రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షునిగా ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు అధిష్టానం బుధవారం ప్రకటించింది. ఈ నియామకాలతో జిల్లా నేతల అంచనాలు తారుమారయ్యాయి. మొదటి నుంచి జిల్లా అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేసిన వారెవరికీ పదవి దక్కలేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి జిల్లాలో ఓసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి భావించారు. తద్వారా జిల్లాలో అన్ని వర్గాలను దగ్గర చేసుకోవ్చనే ఆలోచన చేశారు. ఇదే విషయాన్ని గతంలో పార్టీ అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో బుధవారం ప్రకటించిన జిల్లా అధ్యక్షుల నియామకాలను చూస్తే మంత్రి మాట నెగ్గినట్టు అవగతమవుతోంది. సీఎం కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఎమ్మెల్యే రవీంద్రకుమార్, పక్కన మంత్రి, ఎమ్మెల్యేలు తనకు ఇస్తారని కిషన్‌రెడ్డి భావించినా.. నల్లగొండలో రాజకీయంగా రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ కోటాలో తనకు కచ్చితంగా జిల్లా అధ్యక్ష పదవి దక్కుతుందన్న ఆశలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడా కిషన్‌రెడ్డి భావించారు. గతంలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని కూడా కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడంతో జిల్లా అధ్యక్ష పదవి కచ్చితంగా ఇస్తారని ఎదురుచూసినా దక్కలే. ఆయనతో పాటు గుత్తా జితేందర్‌రెడ్డి, సత్తయ్యగౌడ్ కూడా జిల్లా అధ్యక్ష పదవిని ఆశించారు. కానీ, అనూహ్యంగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన రవీంద్రకుమార్‌కు అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. చదవండి: అనూహ్యంగా తెరపైకి పేరు.. గులాబీ బాస్‌గా ‘కల్వకుంట్ల’ సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లోనూ అంతే.. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల అధ్యక్షుల నియామకాల విషయంలోనూ ఊహించని విధంగా నియామకాలు జరిగాయి. సూర్యాపేట జిల్లా నుంచి వై.వెంకటేశ్వర్లు, ఎస్ఏ రజాక్, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్ పేర్లు చివరి వరకు పరిశీలనలో ఉన్నట్లుగానే పార్టీ వర్గాలు చెప్పుకొచ్చాయి. చివరకు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌కు జిల్లా అధ్యక్ష పదవి వచ్చింది. దీంతో అక్కడ బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చినట్లైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ బూడిద భిక్షమయ్యగౌడ్, ఆకుల ప్రభాకర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వారిద్దరిలో ఎవరో ఒకరికి కచ్చితంగా అధ్యక్ష పదవి దక్కుతుందనే ఊహాగానాలు వచ్చాయి. వాటిని తారుమారు చేస్తూ ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ రామకృష్ణారెడ్డికి పదవిని కట్టబెట్టారు. ఒకటి ఎస్టీ, మరొకటి బీసీ, ఇంకొకటి ఓసీ సామాజికవర్గానికి కేటాయించారు. పవర్ సెంటర్‌గా మారకూడదనే.. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో జిల్లాలో పార్టీ నేతలను అందరిని కలుపుకుపోయే వారినే పార్టీ అధ్యక్షులుగా నియమిస్తారని పార్టీలో మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. అంతేకాదు నియోజకవర్గాల్లో కీలకమైన ఎమ్మెల్యేల మాట కాదనకుండా ముందుకు వెళ్లే వారికే పార్టీ బాధ్యతల అప్పగించాలన్న ఆలోచనలు చేసింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో చాలా చోట్ల పార్టీ బాధ్యతలను కూడా ఎమ్మెల్యేలకే అధిష్టానం అప్పగించింది. ఇక్కడా అదే అమలు చేసింది. దేవరకొండ ఎమ్మెల్యేకు పార్టీ బాధ్యతలు అప్పగించింది. ఆయనతో పార్టీ నేతలు ఎవరికి ఎలాంటి ఇబ్బందీ లేదు. కలిసిపోయే తత్వం కావడం.. మంత్రికి అనుగుణంగానే ఉండే నాయకుడు అయినందున ఆయన్ని నియమించింది. చదవండి: వీరే గులాబీ రథసారథులు.. 33 జిల్లాల అధ్యక్షుల జాబితా ఇదే సూర్యాపేటలో ఎంపీ లింగయ్య యాదవ్ కూడా మంత్రి జగదీష్‌రెడ్డికి అనుకూలంగా ఉంటారు. యాదాద్రిలోనూ అంతే. కాగా, మూడు జిల్లాల్లోనూ అధ్యక్ష పదవిని ఆశించిన వారికి ఇస్తే ఎమ్మెల్యేలకు వారికి మధ్య కొంత గ్యాప్ వస్తుందనే భావన నెలకొంది. పైగా పార్టీ అధ్యక్షులు అయినందున వారు మరో పవర్ సెంటర్‌గా మారుతారనే వాదన ఉంది. అవేమీ లేకుండా మంత్రికి, ఎమ్మెల్యేలకు, ఇతర ప్రజాప్రతినిధులకు అనుగుణంగా ఉండేవారికి అధ్యక్ష పదవులను కట్టబెట్టినట్లు తెలిసింది. కాంగ్రెస్‌కు దీటుగా.. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌కు దీటుగా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులను నియమించింది. నల్లగొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా శంకర్‌నాయక్ ఉండగా, సూర్యాపేట జిల్లా అధ్యక్షునిగా వెంకన్నయాదవ్ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అనిల్‌కుమార్‌రెడ్డి ఉండగా, ఈ మూడు జిల్లాల్లోనూ టీఆర్ఎస్ కూడా అదే సామాజిక వర్గాల వారిని అధ్యక్షులుగా నియమించింది. విధేయత, సమన్వయమే లక్ష్యంగా.. నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్ గతంలో కమ్యూనిస్టు నాయకునిగా ప్రజల్లో తిరిగిన అనుభవంతోపాటు పార్టీకి విధేయుడిగా ఉంటారని పార్టీ అంచనా. బడుగుల లింగయ్య యాదవ్ కూడా టీడీపీ అధ్యక్షునిగా సుధీర్ఘ కాలం పని చేశారు. రామకృష్ణారెడ్డి కూడా పార్టీకి విధేయునిగా ఉండటంతో పాటు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటారన్న అంచనాలతోనే నియామకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. పార్టీ పటిష్టతకు నిరంతరం కృషి దేవరకొండ : జిల్లాలో టీఆర్ఎస్ పార్టీని మరింత పటిష్ట పర్చేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తాని ఆ పార్టీ నూతన జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన సందర్భంగా బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. గిరిజన ఎమ్మెల్యేను అయిన నాపై పూర్తి విశ్వాసం ఉంచి పార్టీ జిల్లా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటానన్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో పార్టీ కార్యకర్తలకు మరింత చేరువయ్యే అవకాశం లభించిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బాధ్యతలు నిర్వర్తిస్తానని చెప్పారు. బయోడేటా పేరు : రమావత్ రవీంద్రకుమార్ స్వస్థలం : దేవరకొండ మండలం రత్యాతండా రాజకీయ ప్రస్థానం: రవీందక్రుమార్ డిగ్రీ ఫైనలియర్ చదువుతుండగానే 1995లో దేవరకొండ మండలం శేరిపల్లి గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశం వచ్చింది. సీపీఐ మద్దతుతో ఆయన సర్పంచ్‌గా గెలుపొందారు. 2001లో రెండోసారి కూడా సర్పంచ్‌గా గెలిచారు. సర్పంచ్‌గా మూడేళ్ల మూడేళ్ల పదవీకాలం పూర్తయ్యాక 2004లో సీపీఐ తరఫున దేవరకొండ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది. ఎమ్మెల్యేగా విజయం సాధించాక సర్పంచ్ పదవికి రాజీనామా చేశారు. 2009లో ఎమ్మెల్యే పోటీచేసి ఓడిపోయారు. 2014లో సీపీఐ నుంచి పోటీచేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 2016లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీచేసి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. -
అనూహ్యంగా తెరపైకి పేరు.. గులాబీ బాస్‌గా ‘కల్వకుంట్ల’
సాక్షి, జగిత్యాల: టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవి అనూహ్యంగా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుకు దక్కింది. అనేకమంది ఆశావహులు కుర్చీ కోసం పోటీపడ్డారు. అయినా, ముఖ్యమంత్రి కేసీఆర్.. విద్యాసాగర్‌రావుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఇంతకాలం కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. గత సెప్టెంబర్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి సంస్థాగత ఎన్నికల సందడి మొదలైంది. నిరాశలో ఆశావహులు.. కీలకమైన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు పలువురు నేతలు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. పార్టీ సంస్థాగత కమిటీలు పూర్తయ్యాక జిల్లా అధ్యక్ష పదవిలో ఎవరిని నియమిస్తారనే అంశాన్ని సీఎం కేసీఆర్‌కు అప్పగిస్తూ అప్పట్లోనే నిర్ణయించారు. అనివార్య కారణాలతో ఆ ప్రక్రియ నిలి చిపోయింది. గ్రామ, మండల, పట్టణ కమిటీల నియామకం పూర్తయ్యింది. ప్రస్తుతం టీఆర్ఎస్ జి ల్లా అధ్యక్షుడిగా విద్యాసాగర్‌రావును ప్రకటిస్తూ సీఎం కేసీఆర్ బుధవారం ప్రకటన చేశారు. చదవండి: వీరే గులాబీ రథసారథులు.. 33 జిల్లాల అధ్యక్షుల జాబితా ఇదే మంత్రి ఆశీస్సులు ఉన్నవారికే పదవులని.. ధర్మపురి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌తోపాటు ఎమ్మెల్యేలకు అనుకూలమైన నాయకుల ఆశీస్సులు ఉన్నవారికే టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవి దక్కుతుందని భావించారు. ఇందుకు భిన్నంగా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుకు అనూహ్యంగా ఆ కుర్చీ దక్కింది. ధర్మపురి జెడ్పీటీసీ బాదినేని రాజేందర్, మల్యాలకు చెందిన మిట్టపల్లి సుదర్శన్, వెల్గటూర్‌కు చెందిన పునుగోటి శ్రీనివాస్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి ఈ పదవిని ఆశించారు. వీరితోపాటు మరికొందరు నాయకులు పోటీపడ్డారు. మంత్రి, ఎమ్మెల్యేలు అందించిన నివేదికలోని పేర్లు, మరికొన్ని పేర్లను అధిష్టానం పరిశీలించింది. ఇంటలిజెన్స్ నివేదిక ఆధారంగా జిల్లా అధ్యక్షుడిగా విద్యాసాగర్‌రావును ఎంపిక చేసినట్లు తెలిసింది. పార్టీ భవనం పూర్తి ధరూర్ క్యాంప్‌లోని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంది. పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీనిని ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఈనేపథ్యంలోనే పార్టీ జిల్లా అధ్యక్ష పదవి భర్తీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బయోడేటా పేరు : కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు (ఎమ్మెల్యే, కోరుట్ల) జననం: 10 నవంబర్ 1953 జన్మస్థలం: రాఘవపేట విద్యార్హతలు: బీఏ రాజకీయ ప్రవేశం..:1977లో స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తూ 1997 అక్టోబర్‌లో టీడీపీలో చేరారు. 1998లో ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2001లో ఇబ్రహీంపట్నం జెడ్పీటీసీగా గెలుపొందారు. 2003లో ఆర్టీసీ జోనల్ చైర్మన్‌గా నియమితులయ్యారు.2008లో టీఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. పార్టీని మరింత బలోపేతం చేస్తా జగిత్యాల/కోరుట్ల: ‘ప్రస్తుతం కోరుట్ల ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా. ఇటీవల టీటీడీ బో ర్డు సభ్యుడిగా అకాశం కల్పించారు. తెలంగా ణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ సీఎం కేసీఆర్ నాకూ అనూహ్యంగా పదవి ఇచ్చారు. ఇది నాపై మరింత బాధ్యత పెంచింది’ అని కోరుట్ల ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు వెల్లడించారు. ఇంకా ఏమంటున్నారంటే.. సాక్షి : చాలామంది జిల్లా అధ్యక్ష పదవి ఆశించారు. సీఎం కేసీఆర్ మిమ్మల్ని నియమించారు. మీ స్పందన ఏమిటి? విద్యాసాగర్‌రావు : ఉద్యమ నాయకుడిగా, సీనియర్ ఎమ్మెల్యేగా నాకు ఈ పదవి అప్పగించారు. బాధ్యతగా ఈ పదవిని నిర్వర్తిస్తా. సాక్షి : ఆశావహులు నిరాశలో ఉంటారు, వారిని ఎలా కలుపుకుపోతారు? విద్యాసాగర్‌రావు : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో అందరినీ సమన్వయపరుస్తూ ముందుకు వెళ్తా. సాక్షి : చాలామంది నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్నారు? విద్యాసాగర్‌రావు : జిల్లామంత్రి సహకారంతో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఆశావహులకు న్యాయం చేస్తా. సాక్షి : రానున్న ఎన్నికల్లో కొత్త అధ్యక్షుడిగా ఎలాంటి చర్యలు చేపడతారు? విద్యాసాగర్‌రావు : టీఆర్ఎస్ ఇప్పటికే నంబర్‌వన్ స్థానంలో ఉంది. రానున్న ఎన్నికల్లో అన్ని ఎన్నికల్లో గెలుస్తాం. కార్యకర్తలు, నాయకుల సమన్వయంతో వెళ్లి పార్టీ పటిష్టతకు కృషి చేస్తాం. సాక్షి : ఎమ్మెల్యేగా, టీటీడీ సభ్యుడిగా, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడి.. వీటన్నింటికీ ఎలా న్యాయం చేస్తారు? విద్యాసాగర్‌రావు : ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నా. టీటీడీ సభ్యుడిగా భక్తులకు దైవ దర్శనం కల్పిస్తున్నాం. పార్టీ అధ్యక్షుడిగా అందరినీ సమన్వయపరుస్తూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తా. -
కేసీఆర్ ఆదేశం.. గులాబీసేనకు కొత్త రథసారథులు!
సాక్షి, వరంగల్ : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి కొత్త రథసారథులు రాబోతున్నారు. అన్ని జిల్లాల్లో వచ్చే నెలాఖరుకల్లా టీఆర్ఎస్ పార్టీ, ధాని అనుబంధ సంఘాల కమిటీలు వేయాలని గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ మేరకు ఉమ్మడి వరంగల్ నేతలకు సంకేతాలు ఇచ్చారు. త్వరలోనే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో ఆయన భేటీ కానున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలి సింది. గ్రామ, డివిజన్ స్థాయి నుంచి జిల్లా కమిటీల రూపకల్పనకు జిల్లాల వారీగా ఇన్చార్్జలను కూడా నియమించనున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 2న జెండా పండుగతో మొదలయ్యే టీఆర్ఎస్ సంస్థాగత సందడి నెలాఖరుకల్లా ముగియనుంది. ఆ లోపు ఆరు కమిటీలు, అనుబంధ సంఘాల జాబితాలు, నివేదికలు ఆయా జిల్లాల నేతలతో మాట్లాడి ఇవ్వాలని ఇద్దరు మంత్రులకు సూచించినట్లు సమాచారం. చదవండి: జిరాక్స్ పేపర్లతో వచ్చి షో చేశాడు: మంత్రి మల్లారెడ్డి జెండా పండుగ నుంచి సందడి.. పార్టీ జిల్లా కమిటీలకు అధ్యక్షుడితో కలిపి 25మంది, అనుబంధ సంఘాలకు 15మంది చొప్పున ఉండేలా పార్టీ మార్గదర్శకాలు, సామాజిక వర్గాల సమతూకం ఆధారంగా కమిటీలను రూపొందించనున్నారు. ఈ మేరకు పలు దఫాలు ఆయా జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకుల ద్వారా సేకరించిన సమాచారం మేరకు జిల్లా రథసారథుల పేర్లు దాదాపుగా ఖరారు చేస్తారని సమాచారం. అయితే సెప్టెంబర్ 1న ఢిల్లీలో పార్టీ కార్యాలయం నిర్మాణంకు శంకుస్థాపన జరగనుండగా, ఆ మరుసటి రోజు (సెప్టెంబర్ 2) నుంచి పార్టీ జెండా జెండా పండుగలు నిర్వహించాలని అధిష్టానం కేడర్‌కు సూచించింది. అదే రోజు నుంచి గ్రామ కమిటీల నిర్మాణం మొదలవుతుంది. 2 నుంచి 12 వరకు గ్రామ, వార్డు కమిటీలు వేయనుండగా, 12 నుంచి 20 వరకు మండల కమిటీలు పూర్తి చేసి, 20 నుంచి నెలాఖరు వరకు జిల్లా కమిటీలు వేయనున్నారు. పోటాపోటీగా ఆశావహులు.. ఏ జిల్లా నుంచి ఎవరు... సుమారు ఐదారేళ్ల తర్వాత జిల్లా కమిటీలు తెరపైకి రావడంతో పోటాపోటీగా ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా పగ్గాలను చేపట్టేందుకు తహతహలాడుతున్నారు. గాడ్ఫాదర్ల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు. హనుమకొండ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ గుండ్రెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, సీనియర్ నేతలు జన్ను జకారియా, గుడిమల్ల రవికుమార్, తాడిశెట్టి విద్యాసాగర్, టి.జనార్దన్ గౌడ్ తదితరుల పేర్లు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. ఈ జిల్లాలో చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, టి.రాజయ్య, సతీష్‌కుమార్ తదితరులు ప్రభావం చూపనుండగా, సమీకరణలు మారే అవకాశం కూడా ఉంది. వరంగల్ జిల్లా నుంచి జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, చింతం సదానందం, నిమ్మగడ్డ వెంకన్న, డాక్టర్ మదన్‌లతోపాటు వరంగల్, నర్సంపేట ప్రాంతాలకు చెందిన ఐదుగురు ఈ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ జిల్లా అధ్యక్షుడి ఎన్నికలో నలుగురు ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరించనున్నారు. ఉమ్మడి వరంగల్ అధ్యక్షుడిగా ఉన్న సీనియర్ నేత తక్కళ్లపెల్లి రవీందర్రావు, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డిల పేర్లు మహబూబాబాద్ జిల్లా అధ్యక్ష పదవి కోసం పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఉమ్మడి వరంగల్ అధ్యక్షుడిగా వ్యవహరించిన రవీందర్‌రావుకు ఈ పదవి చిన్నది కాగా, మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు డీఎస్ రెడ్యానాయక్, శంకర్‌నాయక్‌ల వర్గపోరు ఎవరికీ అవకాశం ఇస్తుందో చూడాలి. జనగామ జిల్లాలో ప్రధానంగా జెడ్పీ మాజీ చైర్మన్ గద్దల పద్మ భర్త నర్సింగరావు, లింగాల ఘన్పూర్ ఎంపీపీ జయశ్రీ భర్త చిట్ల ఉపేందర్‌రెడ్డి, ఇర్రి రమణారెడ్డి, చేవేళ్ల సంపత్‌ల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మంత్రి దయాకర్‌రావు, ఎమ్మెల్యే యాదగిరిరెడ్డిల ఆశీస్సులున్న వారే ఈ జిల్లా పగ్గాలు చేపట్టగలరన్న ప్రచారం ఉంది. ములుగు జిల్లా నుంచి కాకులమర్రి లక్ష్మ ణ్‌రావు, గోవింద్‌నాయక్, గోవిందరావుపేట జెడ్పీటీసీ తుమ్మల హరిబాబు, మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ కుమారుడు అజ్మీర ప్రహ్లాద్‌లు జిల్లా అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు చెబుతున్నారు. 2004లో తెలంగాణ ఉద్యమం సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన గోవింద్నాయక్కు పలు సందర్భాల్లో పదవులు వచ్చినట్లు వచ్చి చేజారాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి పలువురు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితోపాటు టీఆర్ఎస్లో చేరిన బుర్ర రమేష్, క్యాతరాజు సాంబమూర్తి, జెడ్పీ వైస్ చైర్పర్సన్ శోభ భర్త కల్లెపు రఘుపతిరావు, మున్సిపల్ వైస్‌చైర్మన్ కొత్త హరిబాబుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మాజీ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి కుమారుడు సిరికొండ ప్రశాంత్, వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. -
సంబరాలు అంబరాన్నంటాలి
టీఆర్ఎస్ జిల్లా చీఫ్ ‘తక్కళ్లపల్లి’ హన్మకొండ : గోదావరి నదీ జలాల వినియోగంపై మహారాష్ట్రతో నేడు ప్రభుత్వం చేసుకునే చారిత్రక ఒప్పందంతో పాటు జిల్లాల పునర్విభజన ప్రక్రియను అధికారికంగా ప్రారంభించిన నేపథ్యంలో సంబరాలు అంబరాన్ని అంటేలా జరుపుకోవాల ని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు పార్టీ శ్రేణులు, ప్రజలకు పిలుపునిచ్చారు. వర్షాభావంతో బీళ్లుగా మారుతున్న భూములను గోదావరి నదీ జలాల వినియోగంతో సాగులోకి తేవడానికి సీఎం కృషి చేస్తున్నారని చెప్పారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్, మహారాష్ట్ర సర్కారు తరఫున సీఎం దేవేంద్ర పడ్నవీస్ మధ్య మంగళవారం(23న) మధ్యాహ్నం మూడు గంటలకు చారిత్రక ఒప్పందం జరగనుం దని చెప్పారు. ఈ గొప్ప కార్యక్రమంతో వరంగల్ జిల్లాయే ఎక్కువగా లబ్ధిపొందుతుందని, మహా రాష్ట్రతో చేసుకునే ఒప్పందంతో గోదావరి నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ వేగంగా పూర్తవుతాయని తెలిపారు. జిల్లాలోని కరువు ప్రాంతాలు సస్యశ్యాలం అయ్యేందుకు ఇది ఉపయోగడుతుందని చెప్పారు. ఈ ఒప్పందం జరగగానే.. జిల్లా అంత టా భారీగా సంబరాలు జరుపుకోవాలని టీఆర్ఎస్ నాయకులు, శ్రేణులకు, ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. అలాగే ఈనెల 24న రాష్ట్రానికి వస్తున్న సీఎం కేసీఆర్‌కు ఘనంగా స్వాగతం పలికేందుకు జిల్లాలోని టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు భారీగా తరలివెళ్లాలని కోరారు. టీఆర్ఎస్ ఎన్నికల హామీలో పేర్కొన్న ప్రకారం జిల్లాల పునర్విభజన ప్రక్రియను అధికారికంగా ప్రారంభించిన నేపథ్యంలో జిల్లా అంతటా సంబరాలు నిర్వహించాలని సూచరించారు. -
1న జోగిపేటలో తెలంగాణ విజయోత్సవ సభ
జోగిపేట, న్యూస్‌లైన్: జోగిపేటలో ఏప్రిల్ 1న నిర్వహించే సభకు తెలంగాణ విజయోత్సవ సభగా నామకరణం చేసినట్లు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ ప్రకటించారు. శనివారం అందోల్ మండలం డాకూర్‌లో మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 1న జోగిపేటలో లక్షమందితో 15 ఎకరాల స్థలంలో సభ నిర్వహించబోతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న ఈ సభకు ఎంతో ప్రాధాన్యత ఉందని, జిల్లాలో ఇప్పటి వరకు ఎక్కడా నిర్వహించని రీతిలో చారిత్రాత్మకంగా నిలిచిపోయేలా ఈ సభ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సభకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు హరీష్‌రావు తదితరులు హజరుకానున్నారని తెలిపారు. కళా బృందాలతో ధూంధాం సాయిచంద్ కళాబృందంతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని సత్యనారాయణ తెలిపారు. ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్‌లతో పాటు ముఖ్య కళాకారులు హాజరు కానున్నారని, పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. సభకు వచ్చే కార్యకర్తలు, అభిమానుల కోసం ప్రత్యేకంగా మాసానిపల్లి చౌరస్తాలో పులిహోర పాకెట్లు, వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేయనున్నట్లు సత్యనారాయణ వివరించారు. 5 లక్షల వాటర్ ప్యాకెట్లు, 80 క్వింటాళ్ల పులిహోరను సిద్ధం చేయిస్తున్నట్లు తెలిపారు. జోగిపేట నుంచే దిశానిర్దేశం ఈ సభ నుంచి భవిష్యత్తులో జిల్లా ఎ లా ఉండాలో కేసీఆర్ దిశా నిర్దేశం చే యనున్నారని ఆర్ . సత్య నారా య ణ తెలిపారు. సభకు పెద్ద ఎత్తున జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చి విజయవంతం చేయాలని కో రారు. జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి బీబీ పాటిల్, మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి, జిల్లా టీఆర్ఎస్ నాయకుడు సినీ నిర్మాత శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.