1న జోగిపేటలో తెలంగాణ విజయోత్సవ సభ | on april 1 telangana sabha | Sakshi
Sakshi News home page

1న జోగిపేటలో తెలంగాణ విజయోత్సవ సభ

Published Sat, Mar 29 2014 11:42 PM | Last Updated on Sat, Sep 2 2017 5:20 AM

1న జోగిపేటలో తెలంగాణ విజయోత్సవ సభ

1న జోగిపేటలో తెలంగాణ విజయోత్సవ సభ

 జోగిపేట, న్యూస్‌లైన్: జోగిపేటలో ఏప్రిల్ 1న నిర్వహించే సభకు తెలంగాణ విజయోత్సవ సభగా నామకరణం చేసినట్లు టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ ప్రకటించారు. శనివారం అందోల్ మండలం డాకూర్‌లో మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 1న జోగిపేటలో లక్షమందితో 15 ఎకరాల స్థలంలో సభ నిర్వహించబోతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న ఈ సభకు ఎంతో ప్రాధాన్యత ఉందని, జిల్లాలో ఇప్పటి వరకు ఎక్కడా నిర్వహించని రీతిలో చారిత్రాత్మకంగా నిలిచిపోయేలా ఈ సభ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.  సభకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు హరీష్‌రావు తదితరులు  హజరుకానున్నారని తెలిపారు.

 కళా బృందాలతో ధూంధాం

సాయిచంద్ కళాబృందంతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని సత్యనారాయణ తెలిపారు. ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్‌లతో పాటు ముఖ్య కళాకారులు హాజరు కానున్నారని, పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. సభకు వచ్చే కార్యకర్తలు, అభిమానుల కోసం ప్రత్యేకంగా మాసానిపల్లి చౌరస్తాలో పులిహోర పాకెట్లు, వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేయనున్నట్లు సత్యనారాయణ వివరించారు. 5 లక్షల వాటర్ ప్యాకెట్లు, 80 క్వింటాళ్ల పులిహోరను సిద్ధం చేయిస్తున్నట్లు తెలిపారు.

 జోగిపేట నుంచే దిశానిర్దేశం

 ఈ సభ నుంచి భవిష్యత్తులో జిల్లా ఎ లా ఉండాలో కేసీఆర్ దిశా నిర్దేశం చే యనున్నారని ఆర్ . సత్య నారా య ణ తెలిపారు.  సభకు పెద్ద ఎత్తున జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చి విజయవంతం చేయాలని  కో రారు. జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి  బీబీ పాటిల్, మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి, జిల్లా టీఆర్‌ఎస్ నాయకుడు సినీ నిర్మాత శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement