ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ పాలనపై లేదు | Chada about Kcr and chandrababu | Sakshi
Sakshi News home page

ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ పాలనపై లేదు

Published Mon, Feb 29 2016 2:48 AM | Last Updated on Sat, Aug 18 2018 6:11 PM

ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ పాలనపై లేదు - Sakshi

ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ పాలనపై లేదు

కేసీఆర్ దారిలోనే చంద్రబాబు: చాడ వెంకటరెడ్డి

 కరీంనగర్: సీఎం కేసీఆర్‌కు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడంపై ఉన్న శ్రద్ధ పాలనపై లేదని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన కరీంనగర్‌లో విలేకరులతో మాట్లాడారు. నిజామాబాద్‌లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య గొడవలతో టీఆర్‌ఎస్ కుమ్ములాటలు మొదలయ్యూయని వెల్లడైందన్నారు. ఇక్కడ కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నట్లుగానే ఏపీ సీఎం చంద్రబాబు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుంటున్నారన్నారు.

కేంద్రం ప్రభుత్వ విధానాలతో దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ పాలన సాగుతోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని అభాసుపాలు చేస్తూ పోలీసుల సమక్షంలోనే విద్యార్థి నాయకుడు కన్హయ్యకుమార్‌పై బీజేపీ దాడికి తెగబడిందని హెచ్‌సీయూ, జేఎన్‌యూ ఘటనలపై ప్రధాని మోదీ స్పందించకపోవడం బాధకరమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement