మరో సారి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చందబ్రాబు నాయుడు ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచారు.
మరో సారి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చందబ్రాబు నాయుడు ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచారు. ఈ ఏడాది నుంచే ఏర్పాటు చేస్తానన్న కాపు కార్పోరేషన్ నిధులపై చంద్రబాబు మాట మార్చారు. కాపు కార్పోరేషన్ కు రూ. వెయ్యి కోట్లు ఇస్తామని హామీ ఇవ్వడంతో... కాపు రిజర్వేషన్ల పై ఉద్యమించిన ముద్రగడ పద్మనాభం.. తన ఆమరణ నిరాహార దీక్ష విరమించిన సంగతి తెలిసిందే.
అయితే గురువారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నిర్వహించిన కాపు రుణ మేళాలో పాల్గొన్న ముఖ్యమంత్రి వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామంటూ మాట మార్చారు. మంజునాథ కమిషన్ నివేదిక రాగానే.. రిజర్వేష్లపై నిర్ణయంతీసుకుంటామని అన్నారు. కాపు నేతలకు రాజకీయ జీవితం ప్రసాదించింది.. టీడీపీనే అంటూ ఈ సందర్భంగా గుర్తు చేశారు.