రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని అనంతపురం జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతపురం : రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని అనంతపురం జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు లేక పంటలన్నీ ఎండిపోతున్నాయని, చేసిన అప్పుకు వడ్డీ సైతం కట్టలేని పరిస్థితిలో ఉన్నామని రైతులు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం పులివెందుల వెళుతూ అనంతపురం జిల్లాలో ఆగారు.
ఈ సందర్భంగా బీదరెడ్డిపల్లి వద్ద ఎండిపోయిన వేరుశెనగ పంటలను ఆయన పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని రైతులు ఈ సందర్భంగా వైఎస్ జగన్కు విజ్ఞప్తి చేశారు. కాగా అనంతపురం జిల్లాలో కరువు దుస్థితిని పార్టీ నేతలు శంకర్ నారాయణ, చాంద్ బాషా, నవీన్ నిశ్చల్ తదితరులు ...వైఎస్ జగన్కు వివరించారు.