విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. విజయవాడలోని గేట్వే హోటల్లో ఈ సమావేశం జరిగింది. హైకోర్టు విభజన, ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల అంశాలపై ఈ భేటీలో చర్చించారు. అనంతరం గవర్నర్ ను చంద్రబాబు తన నివాసంలో విందుకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఒకే వాహనంలో చంద్రబాబు, గవర్నర్ నరసింహన్ ...ఉండవల్లిలోని సీఎం అధికార నివాసానికి వెళ్లారు. కాగా గవర్నర్ ఈరోజు సాయంత్రం హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్న విషయం తెలిసిందే.
చంద్రబాబు నివాసానికి గవర్నర్
Published Wed, Jul 6 2016 8:38 PM | Last Updated on Fri, Aug 31 2018 8:26 PM
Advertisement
Advertisement