తేలుకాటుతో చిన్నారి మృతి చెందింది. వివరాలు..మండలంలోని పులిగిల్ల గ్రామానికి చెందిన వేముల శంకర్‌కు ముగ్గురు కూతుళ్లు. అందులో రెండో కుమార్తె శృతి(7) అదే గ్రామంలో రెండవ తరగతి చదువుతోంది.
వలిగొండ : తేలుకాటుతో చిన్నారి మృతి చెందింది. వివరాలు..మండలంలోని పులిగిల్ల గ్రామానికి చెందిన వేముల శంకర్‌కు ముగ్గురు కూతుళ్లు. అందులో రెండో కుమార్తె శృతి(7) అదే గ్రామంలో రెండవ తరగతి చదువుతోంది. ఈమెను మంగళవారం పాఠశాలకు పంపించడానికి స్కూల్ యూనిఫాం వేస్తుండగా అందులో ఉన్న తేలు కరిచింది. దీంతో బాలికను సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందింది. కుబుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు బుధవారం కేసు నమోదు చేసుకున్నారు.