రాయదుర్గం అర్బన్ : రాయదుర్గం మండలం 75 వీరాపురం వద్ద ఉన్న అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి వేరుశగన బస్తాలతో వెళుతున్న బొలేరో లగేజీ వాహనం ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో కణేకల్లు మండలం మాల్యం గ్రామానికి చెందిన కురుబ అనంతమ్మ కుమారుడైన పది నెలల చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక ప్రభుత్వాస్పపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం బళ్లారి విమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్నట్లు ఏఎస్‌ఐ నారాయణ తెలిపారు.