సాహిత్యంతో సద్గుణాలు అలవడుతాయి | children literrturer seminar in siricilla | Sakshi
Sakshi News home page

సాహిత్యంతో సద్గుణాలు అలవడుతాయి

Published Sat, Sep 3 2016 10:11 PM | Last Updated on Mon, Aug 13 2018 7:57 PM

సాహిత్యంతో సద్గుణాలు అలవడుతాయి - Sakshi

సాహిత్యంతో సద్గుణాలు అలవడుతాయి

  •  కేంద్ర సాహిత్య అకాడమీ సంచాలకులు ఆచార్య ఎన్‌.గోపి 
  • సిరిసిల్ల: బాలసాహిత్యంతో పిల్లల్లో సద్గుణాలు అలవడుతాయని, బాలల మనోవికాసానికి సాహిత్యం ఎంతో అవసరమని కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సంచాలకులు ఎన్‌.గోపి అన్నారు. పఠనాసక్తి తగ్గిపోయిన ఈ రోజుల్లో సాహిత్యంపై పిల్లలకు అవగాహన లేకుండా పోతోందని,  ఇలాంటి శిబిరాల ద్వారా పిల్లలకు సాహిత్యంపై ఆసక్తిని పెంచవచ్చని అన్నారు. పద్నాలుగేళ్ల వరకు బాలసాహిత్యంపై పిల్లలకు ఆసక్తిని కలిగిస్తే.. మానవీయ విలువలు, కరుణ, ప్రేమ, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని సాగిస్తారని వివరించారు. బాలసాహిత్యం రాయాలంటే తల్లివంటి ప్రేమ ఉండాలన్నారు. సాహిత్య అకాడమీ యాభై ఏళ్లలో ఆరువందల పుస్తకాలు ముద్రిస్తే.. గత రెండేళ్లలోనే రెండువందల పుస్తకాలు ముద్రించిందన్నారు. సమావేశంలో నేషనల్‌ బుక్‌ట్రస్ట్‌ అసిస్టెంట్‌ ఎడిటర్‌ డాక్టర్‌ పత్తిపాక మోహన్, రంగినేని సుజాత మోహన్‌రావు ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు రంగినేని మోహన్‌రావు, ప్రముఖ కవులు జూకంటి జగన్నాథం, డాక్టర్‌ నలిమెల భాస్కర్, పెద్దింటి అశోక్‌కుమార్, మద్దికుంట లక్ష్మణ్, బాలసాహితీవేత్తలు వాసాల నర్సయ్య, భూపాల్, చొక్కాపు వెంకటరమణ, కందేపి రాణీప్రసాద్, దాసరి వెంకటరమణ, తిరునగరి వేదాంతసూరి, ఆకేళ్ల వెంకటసుబ్బలక్ష్మీ, పెండెం జగధీశ్వర్, ఎస్‌.కె.అబ్దుల్‌ హకీం జాని, పైడిమర్రి రామకృష్ణ, మలయశ్రీ, వి.ఆర్‌.శర్మ, దార్ల బుజ్జిబాబు, ఎస్‌.రఘు, పెందోట వెంకటేశ్వర్లు, వాసరవేణి పర్శరాములు, రంగినేని నవీన్, తూడి వెంకట్‌రావు, గరిపెల్లి అశోక్, డాక్టర్‌ జనపాల శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
     
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement