అలరించిన చైతన్యప్రభు నాటిక | chithanya prabhu natika in prasanthi nilayam | Sakshi
Sakshi News home page

అలరించిన చైతన్యప్రభు నాటిక

Published Sat, Sep 9 2017 11:09 PM | Last Updated on Sun, Sep 17 2017 6:39 PM

అలరించిన చైతన్యప్రభు నాటిక

అలరించిన చైతన్యప్రభు నాటిక

పుట్టపర్తి అర్బన్‌: విశ్వశాంతి కోసం పరితపించిన సత్యసాయి బాబా తన భక్త లోకాన్ని శాంతి, ప్రేమ అనే మార్గాల్లో చైతన్యపరిచి నడిపించిన మహనీయుడనే ఇతి వృత్తంతో కూడిన ‘శ్రీకృష్ణ చైతన్యప్రభు’ నాటిక అబ్బురపరిచింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలకు చెందిన సత్యసాయి భక్త బృందం, బాలవికాస్‌ విద్యార్థులు శనివారం పుట్టపర్తి ప్రశాంతి నిలయం విచ్చేశారు. పర్తి యాత్ర పేరుతో విచ్చేసిన భక్త బృందం శ్రీకృష్ణుని జీవిత గాథలను సత్యసాయికి అనుకరిస్తూ పలు నృత్య నాటికలు, సంగీత కచేరీలు నిర్వహించారు. 16వ శతాబ్దంలో కృష్ణభగవానుడి ప్రియభక్తుడైన కృష్ణ చైతన్య ఇతివృత్తాన్ని అభినయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement