ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మెదక్లోని సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ముందుగా శిలువను ఊరేగించారు. దీంతో వేడుకలు ఆరంభమయ్యాయి. దక్షిణ ఇండియా సంఘం మెదక్ అధ్యక్ష మండలం వైస్ చైర్మన్ రెవరెండ్ సాల్మన్ ముఖ్య అతిథిగా పాల్గొని భక్తులకు దైవసందేశాన్ని అందజేశారు. భక్తబృందం పలు పాటలు ఆలపించింది.
హైదరాబాద్ సహా పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో మెదక్ చర్చికి వచ్చారు. దాదాపు రెండు లక్షల మందికి పైగా భక్తులు క్రిస్మస్ సందర్భంగా ఇక్కడకు వస్తారని అంచనా వేస్తున్నారు. కులమతాలకు అతీతంగా పలువురు ఇక్కడకు వస్తుండటం ఈసారి విశేషం. తాము గత ఐదేళ్ల నుంచి మెదక్ చర్చికి వస్తున్నామని, ఇది తమకు అలవాటుగా మారిందని హైదరాబాద్కు చెందిన ఓ జంట చెప్పారు.
మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఆరంభం
Published Wed, Dec 25 2013 8:44 AM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM
Advertisement