సివిల్స్లో ఆ నలుగురు | civils toppers from prakasam district | Sakshi
Sakshi News home page

సివిల్స్లో ఆ నలుగురు

Published Wed, May 11 2016 4:45 PM | Last Updated on Sun, Sep 3 2017 11:53 PM

సివిల్స్లో ఆ నలుగురు

సివిల్స్లో ఆ నలుగురు

ఒంగోలు:

చదివేశారు.. నాలెడ్జ్‌ను పట్టేశారు..ర్యాంకులు కొట్టేశారు. ప్రతి పట్టభద్రుని కల సివిల్‌సర్వీసెస్. దానిలో ఉత్తమ ర్యాంకులు సాధించడటం అంటే పెద్ద సవాలే. అరుుతే మనవాళ్లు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. దీనివెనుక కఠోర శ్రమ.. కృషి.. పట్టుదల ఉంది. అందుకే జిల్లా పేరును దేశంలో మార్మోగించారు.

 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్స్ ఫలితాల్లో ఒంగోలువాసి షేక్ రిజ్వాన్‌బాషా సత్తా చాటారు. ఈయన స్వస్థలం మార్కాపురం. తండ్రి పోలీసు డిపార్టుమెంట్‌లో ఉద్యోగి. ఆయన చీరాలలో పనిచేస్తున్న సమయంలో రిజ్వాన్‌బాషా అక్కడ ఆదిత్య పబ్లిక్ స్కూలులో.. అనంతరం చీరాలలోని విజ్ఞానభారతి జూనియర్ కాలేజీలో ఇంటర్‌మీడియెట్ పూర్తిచేశారు. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్‌లో బి.టెక్ చేశారు. నాలుగు సంవత్సరాలపాటు ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. తొలి దశలో 1214 ర్యాంకు వచ్చింది. దీంతో కేంద్ర సమాచార విభాగంలో సహాయ సంచాలకులుగా ఉద్యోగం లభించింది.  ప్రస్తుతం ఢిల్లీలో శిక్షణ పొందుతున్నారు. తాజాగా విడుదలైన సివిల్స్ ఫలితాల్లో  847 ర్యాంకు లభించింది. బాషా కుటుంబం ప్రస్తుతం ఒంగోలులోని సుజాతానగర్ మొదటి లైనులో నివాసం ఉంటోంది. ఈయన తండ్రి అబ్దుల్ మాజిద్ జిల్లా పోలీసు కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.  ప్రతిరోజూ క్రమం తప్పకుండా పత్రికలు చదువడం.. నోట్సు తయారుచేసుకోవడం, పరీక్షా విధానంపై అవగాహన పెంచుకున్నారు. ‘బెంగళూరులో స్నేహితులతో కలిసి రూములో ఉంటూ సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యాను. నా లక్ష్యం మాత్రం ఐఏఎస్’ అని చెప్పారు.
 
 రెండో ప్రయత్నంలో 103వ ర్యాంకు
 కందుకూరు: గుడ్లూరు మండలం గుళ్లపాలెంకు చెందిన స్నేహజ సివిల్స్ పరీక్షల్లో జాతీయ స్థాయి ర్యాంకు సాధించారు. రెండో ప్రయత్నంలోనే 103వ ర్యాంకు సాధించి సివిల్స్ సర్వీస్‌కు ఎంపికయ్యూరు. గుళ్లపాలెం గ్రామానికి చెందిన జొన్నలగడ్డ వెంకటేశ్వర్లు, సుజాతలు తల్లిదండ్రులు. తండ్రి హైదరాబాద్‌లో ఆడిటర్ కావడంతో ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు. స్నేహజ విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లోనే సాగింది. హైదరాబాద్‌లో సీఏ కోర్సు పూర్తి చేసిన స్నేహజ ఆ తరువాత సివిల్స్ లక్ష్యంగా ముందుకు సాగింది. ఢిల్లీలో కోచింగ్ తీసుకున్న తర్వాత మొదటి ప్రయత్నంలో డిఫెన్స్ విభాగంలో ఉద్యోగానికి ఎంపికయ్యూరు. గుళ్లపాలెంలో ఆమె తాత, నానమ్మలు, బాబాయి వెంకటాద్రి, కుటుంబ సభ్యులతో పాటు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి చెందిన అమ్మాయి జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధించడం గర్వకారణంగా ఉందన్నారు.
 
 
 కనిగిరి ఆణిముత్యం
 కనిగిరి: మండల పరిధిలోని పునుగోడుకు చెందిన ఉపాధ్యాయుడు అల్లాటిపల్లి నారాయణరెడ్డి, రత్నమ్మ దంపతుల కుమారు పవన్ కుమార్‌రె డ్డి సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో సత్తా చాటి ఐపీఎస్‌కు సెలక్టు అయ్యూరు. 1 నుంచి 4వ తరగతి వరకు నేరేడుపల్లి ప్రభుత్వ పాఠశాలలో, 5వ తరగతి పునుగోడు ప్రభుత్వ పాఠశాలలో.. 6 నుంచి 10 వరకు ఒంగోలు నవోదయలో విద్యను అభ్యసించారు. ఆ సమయంలో కలెక్టర్ సునీల్ శర్మ స్ఫూర్తితో సివిల్ సర్వీస్‌కు ఎంపిక కావాలని నిర్ణరుుంచుకున్నారు. ఇంటర్ నెల్లూరు రత్నం స్కూల్‌లో, ఏజీ బీఎస్సీ బాపట్లలో, ఏజీ ఎంబీఏ ఉత్తరఖండ్‌లో పూర్తి చేసినట్లు తెలిపారు. ఏఈఓగా దొనకొండలో ఉద్యోగం చేస్తూనే 2012 నుంచి ఇప్పటికి నాలుగు సార్లు ప్రయత్నం చేసి 179వ ర్యాంక్ సాధించినట్లు చెప్పారు. తన తల్లిదండ్రులు.. బంధువైన ఆల్ఫా విద్యాసంస్థల అధినేత జి. మాలకొండారెడ్డి  ప్రోత్సాహం మరువలేనన్నారు. కనిగిరి ప్రాంతం నుంచి రెండో ఐపీఎస్ అధికారిగా ఏ పవన్ కుమార్‌రెడ్డి ఎంపికయ్యారు. ఆవుల రమేష్‌రెడ్డి పదేళ్ల క్రితం మొట్టమొదటిసారిగా ఐపీఎస్‌కు ఎంపికయ్యారు.
 
 రైతు బిడ్డకు  216వ ర్యాంకు
 కొమరోలు: మండలంలోని ఇడమకల్లు గ్రామానికి చెందిన సంజామల వెంకటేశ్వర్‌కు 216వ ర్యాంకు వచ్చింది. వెంకటేశ్వర్ తండ్రి వెంకటయ్య రైతు. మొదటి కుమారుడు వైద్యుడుగా పనిచేస్తున్నారు. వెంకటేశ్వర్ కూడా విశాఖపట్టణంలో వైద్య వృత్తిలో ఉన్నారు.10వ తరగతి గుంటూరులోని  లయాలా పబ్లిక్ స్కూల్‌లో, ఇంటర్మీడియెట్ విశాఖపట్టణంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో చదివారు. ఆంధ్రా మెడికల్ కళాశాలలో 2013లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 2013లో ఐఆర్‌ఏఎంకు ఎంపికయ్యారు. 2014లో ఐడీఈఎఫ్‌కు ఎంపికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement