జగదేవ్‌పూర్(మెదక్): ముఖ్యమంత్రి కేసీఆర్ తన దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో శుక్రవారం డబుల్ బెడ్రూం ఇళ్ల పనులను పరిశీంచారు. అనంతరం గ్రామచావిడి వద్ద గ్రామసభలో పాల్గొని ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలకు మంజూరైన 42 ట్రాక్టర్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. ప్రజలు సంఘటిత శక్తి అని ఎర్రవల్లి, నర్సన్న పేట గ్రామస్తులు నిరూపించాలని తెలిపారు. బర్రెలు, ఆవులు, కోళ్లతో ప్రత్యామ్నయ వ్యవసాయ ఆదాయం పెంచుకోవాలన్నారు. ఎర్రవల్లిలో ఇంటింటా ఇంటర్ నెట్ సౌకర్యం అందిస్తామని కేసీఆర్ తెలిపారు.