బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నాం: కేసీఆర్‌ | cm kcr speech on telangana formation day | Sakshi
Sakshi News home page

బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నాం: కేసీఆర్‌

Published Thu, Jun 2 2016 12:11 PM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM

బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నాం: కేసీఆర్‌ - Sakshi

బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నాం: కేసీఆర్‌

హైదరాబాద్‌: ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర రెండో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం పరేడ్ గ్రౌండ్స్‌లో అధికారిక వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ.. ఈ రెండేళ్లకాలంలో తెలంగాణ రాష్ట్రం ఎన్నో బాలారిష్టాలను అధిగమించి.. దేశంలోనే నంబర్‌ వన్‌ రాష్ట్రంగా అభివృద్ధిలో ముందుకుసాగుతున్నదని పేర్కొన్నారు. తెలంగాణ వస్తే విద్యుత్‌ ఉండదని, కారుచీకట్లు కమ్ముకుంటాయని అందరూ భయపెట్టారని, కానీ, ప్రత్యేక రాష్ట్రంతో చీకట్లు తొలిగి వెలుగుజిలుగుల తెలంగాణ ఆవిష్కృతమైందని, అభివృద్ధి లో తెలంగాణ రాష్ట్రం చరిత్ర తిరగరాసిందని ఆయన పేర్కొన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
 

  • ప్రత్యేక రాష్ట్రం కోసం శాంతియుత పంథాలో సాగిన పోరాటం ఫలించింది
  • ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ద్వితీయశ్రేణి పౌరులుగా బతికారు
  • వివక్షకు వ్యతిరేకంగా నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంగా కొత్త రాష్ట్రాన్ని సాధించుకున్నాం
  • తెలంగాణ రాష్ట్రంలో తమ బతుకులు బాగుపడుతాయన్న ప్రజల నమ్మకాన్ని ఈ రెండేళ్ల కాలం నిలబెట్టింది
  • టీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నాం
  • మ్యానిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా ప్రజల సంక్షేమం దృష్ట్యా అమలుచేస్తున్నాం
  • గత ప్రభుత్వాల మూస విధానాలు సమూలంగా మార్చివేశం, పారదర్శకమైన సుపారిపలన అందించేదిశగా సాగుతున్నాం
  • తెలంగాణలో మన నిధులు మనమే ఉపయోగించుకుంటున్నాం
  • బంగారు తెలంగాణ నిర్మాణానికి స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళుతున్నాం
  • బడ్జెట్‌లో ప్రణాళికేతర వ్యయం కన్నా ప్రణాళిక వ్యయం ఎక్కువగా ఉండటం అపూర్వం
  • ప్రభుత్వం సంక్షేమ రంగానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నది
  • అసహాయులకు, అభాగ్యులకు మానవతా దృష్టితో ఫించన్లు ఇస్తున్నాం
  • పేదింటి ఆడబిడ్డ పెళ్లిబారాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతో 'కల్యాణలక్ష్మి', 'షాదీ ముబారక్‌' పథకాలు తీసుకొచ్చాం
  • కల్యాణలక్ష్మి పథకాన్ని బీసీలకూ, ఇతర కుల్లాల్లోని పేదలకు వర్తింపజేశాం
  • ఈ పథకం వల్ల బాల్యవివాహాలు ఆగిపోయాయి
  • తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలికి ఆలమటించకూడదని.. ప్రతి కుటుంబం ఆహార అవసరాలకు అనుగుణంగా  ఒక్కోక్కరికి 6 కిలోల చొప్పున రేషన్ బియ్యం ఇస్తున్నాం
  • ప్రభుత్వ హాస్టళ్లలో, గురుకులాల్లో, పాఠశాలలల్లో మధ్యాహ్న భోజన పథకానికి సన్నబియ్యం అందిస్తున్నాం
  • తెలంగాణ కోసం అమరులు చేసిన త్యాగాలు చిరస్మరణీయం.. ప్రతి అమరుడి కుటుంబానికి రూ. పది లక్షల చొప్పున పరిహారం అందించాం.
  • అవతరణ దినోత్సవం సందర్భంగా 598మంది అమరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నాం
  • జర్నలిస్టులకు హైదరాబాద్‌లో విడతలవారీగా ప్రత్యేక కాలనీ
  • వ్యవసాయ దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూపంపిణీ
  • తెలంగాణ వస్తే కరెంటు కష్టాలు తొలిగిపోతాయన్న రైతుల విశ్వాసం నిలబడింది
  • ఇక తెలంగాణలో విద్యుత్ కోతలు ఉండవు, రెప్పపాటు కూడా కరెంటుపోదు
  • తెలంగాణ వస్తే ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు వస్తాయన్నది అక్షర సత్యమైంది
  • 'మిషన్ భగీరథ' పథకం ద్వారా ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరు అందిస్తాం
  • సమైక్య పాలనలో గోదావరి, కృష్ణ జలాలను తెలంగాణ వాడుకునేరీతిలో ప్రాజెక్టులు నిర్మితం కాలేదు
  • తెలంగాణ భౌగోళిక పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేసి.. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ చేశాం
  • సాగునీటి ప్రాజెక్టులపై మహారాష్ట్రతో చారిత్రక ఒప్పందం కుదుర్చుకున్నాం
  • మహారాష్ట్ర, కర్ణాటకలతో ఆశించిన మద్దతు లభిస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌ మాత్రం మోకాలడ్డుతోంది
  • వరుసగా రెండేళ్లు కరువు వచ్చినా సరే రైతులు ఇబ్బందిపడకుండా ఉండేందుకు వీలుగా జలవిధానం చేపట్టాం
  • 2018నాటికి పాలమూరు, డిండి, సీతరామ ప్రాజెక్టుల ద్వారా రైతులకు నీళ్లు అందుతాయి
  • కల్వకూర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులు 2017లోగా పూర్తవుతాయి
  • ఆదిలాబాద్‌లో కోమరం భీం, నీల్వాయి, జగన్నాథపురం ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందిస్తాం
  • తెలంగాణలో మొత్తం కోటి ఎకరాలకు సాగునీరందిస్తాం
  • ఘనపూర్ ఆనకట్ట ద్వారా 25వేల ఎకరాలకు నీరు అందిస్తాం
  • సమైక్య పాలనలో చెరువులు ధ్వంసమయ్యాయి.. చెరువుల పునరుద్ధరణకు మిషన్ కాకతీయ పథకం చేపట్టాం
  • సమగ్ర రహదారుల విధానం రూపొందించుకున్నాం
  • కేవలం రెండేళ్లలోనే తెలంగాణలో రహదారులు బాగుపడ్డాయి
  • స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా అక్షరాస్యత తగినంతగా లేకపోవడం విచారకరం
  • ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలు అక్షరాస్యత విషయంలో వెనుకబడ్డాయి
  • సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నది
  • ప్రభుత్వ విద్యను పటిష్టపరుస్తాం
  • నాణ్యమైన విద్య, మంచి ఆహారం అందిస్తే పేద పిల్లలు కూడా ఏ రందీ లేకుండా చదువుకుంటారు
  • సర్కారు దవాఖానాల ఆధునీకరణ, ఆరోగ్యకరమైన పరిస్థితుల కల్పనకు చర్యలు
  • మన జనాభాకు అనుగుణంగా మల్టీ స్పెషల్ ఆస్పత్రులు నిర్మించబోతున్నాం
  • జిల్లాకు నాలుగు చొప్పున డయాలసిస్‌, ఐసీయూలు నిర్మించాలని నిర్ణయించాం
  • సింగిల్ విండో పారిశ్రామిక విధానానికి ఎంతో స్పందన వస్తోంది
  • ఐటీ సేవల్లో దేశంలోనే నంబర్‌ వన్‌గా తెలంగాణ నిలించింది
  • వరంగల్‌ లాంటి ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ పరిశ్రమను విస్తరిస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement