సీఎం కేసీఆర్ గురువారం సాయంత్రం 5.40 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు.
జగదేవ్‌పూర్ (మెదక్) : సీఎం కేసీఆర్ గురువారం సాయంత్రం 5.40 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ఆయన ఆ వెంటనే ఫాంహౌస్‌కు వెళ్లారు. ఫాంహౌస్ పర్యవేక్షకుడు జహంగీర్‌తో కలిసి వ్యవసాయ క్షేత్రంలో పర్యటించారు.
పాలీహౌస్ పనులను పరిశీలించి పలు సూచనలు చేసినట్టు తెలిసింది. తన దత్తత గ్రామాల్లో జరుగుతోన్న అభివృద్ధి పనులపై ఆరా తీసినట్టు సమాచారం. గజ్వేల్‌లో మిషన్ భగీరథ పనులు పూర్తి కావడంతో ఇంటింటికి నల్లా నీటిని అందించే కార్యక్రమాన్ని ఈ నెల 16న ముఖ్యమంత్రి ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలిసింది.