అదృశ్యంపై ఫిర్యాదు | complaint on missing | Sakshi
Sakshi News home page

అదృశ్యంపై ఫిర్యాదు

Published Fri, Dec 16 2016 12:39 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

complaint on missing

అనంతపురం సెంట్రల్‌ : తన భర్త జగన్నాథం(40) కనిపించడం లేదంటూ అనంతపురం రూరల్‌ మండలం కురుగుంటకు చెందిన  సునీత(ఉరవకొండలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో టీచర్‌)గురువారం తమకు ఫిర్యాదు చేసినట్లు రూరల్‌ ఎస్‌ఐ శివ తెలిపారు. సెల్‌ఫో¯ŒS టవర్స్‌ కంపెనీలో పని చేసే తన భర్త ఈ నెల 7న కంపనీ పనిపై హైదరాబాద్‌లోని కాచిగూడకు వెళ్లినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తరువాత ఇంటికి తిరిగి రాలేదన్నారు. అన్ని చోట్ల వెతికినా ప్రయోజనం లేకపోవడంతో తమకు ఫిర్యాదు చేశారని ఎస్‌ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement