ఫిర్యాదులను సమగ్రంగా పరిశీలించండి
- ఎమ్మెల్సీ ఓటరు జాబితాపై కలెక్టర ఆదేశం
కర్నూలు(అగ్రికల్చర్): శాసనమండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల ఓటర్ల జాబితాలోని తప్పులకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశించారు. ఓటరు జాబితాలో దొర్లిన తప్పుల సవరణ, ఎన్నికల విధుల నిర్వహణపై శనివారం కలెక్టర్ తహసీల్దార్లకు దిశానిర్దేశం చేశారు. పట్టభుద్రల ఓటర్ల జాబితాలో 82, ఉపాద్యాయుల జాబితాలో 282 తప్పులున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల ప్రదాన అధికారికి పిర్యాదులందాయని, వీటిని క్రైటీరియా ప్రకారం సర్టిపికెట్లు సమగ్రంగా పరిశీలించి అర్హత కలిగిన వాటని తక్షణమే నమోదు చేయాలని ఆదేశించారు. శాసనమండలి ఎన్నికలు కఠినంగా ఉంటాయని, ఎన్నికల కమిషన్ పిన్ పాయింట్ ప్రకారం ప్రతి విషయాన్ని పరిశీలిస్తుందని తెలిపారు. ఏ మాత్రం తప్పులు, పొరపాట్లు దొర్లినా తహసీల్దార్లకు ఇబ్బందులు తప్పవన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో డీఆర్‌ఓ గంగాధర్‌గౌడ్, ఆర్‌డీఓలు హుసేన్‌సాహెబ్, రాంసుందర్‌రెడ్డి, ఓబులేసు, తహసీల్దార్లు పాల్గొన్నారు.