- హాజరైన ప్రజాసంఘాల నాయకులు
- పాడెమోసిన టఫ్ చైర్‌పర్సన్ విమలక్క
ముగిసిన రాజవ్వ అంత్యక్రియలు
Published Sat, Aug 20 2016 10:32 PM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM
బోయినపల్లి : పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చిట్యాల రాజవ్వ ఉరఫ్ కొదురుపాక రాజవ్వ అంత్యక్రియలు మండలంలోని కొదురుపాకలో శనివారం నిర్వహించారు. అనారోగ్యంతో రాజవ్వ గురువారం రాత్రి మతిచెందింది. అంత్యక్రియలకు ప్రజాసంఘాల నాయకులు హాజరై మతదేహంపై ఎర్ర జెండా కప్పి లాల్‌సలాం..! అంటూ నినాదాలు చేశారు. అనంతరం అరుణోదయ కళాకారులు పాటలు పాడుతూ అంతిమ యాత్ర నిర్వహించారు. 1978 నుంచి జనశక్తి అధినేత కూర రాజన్న, అమర్, విమలక్క తదితర నేతలతో రైతుకూలీ సాయుధ పోరాటాలు చేసి భూస్వాముల గుండెల్లో రాజవ్వ నిదుర పోయిందని ప్రజాసంఘాల నాయకులు పేర్కొన్నారు. సిరిసిల్ల రైతాంగ పోరాటంలో భూస్వామ్య వ్యతిరేక పోరాటం చేసిన కామ్రేడ్ రాజవ్వ అంతిమ యాత్రలో టఫ్ చైర్‌పర్సన్ విమలక్క పాల్గొని పాడె మోశారు. కార్యక్రమంలో అరుణోదయ కళాకారులు బైరాగి, శ్రామిక శక్తి నాయకురాలు గొట్టె రుక్మిణి, టఫ్ జిల్లా అధ్యక్షుడు బొల్లం లింగమూర్తి, పీడీఎస్‌యూ ప్రధాన కార్యదర్శి సాయి, లచ్చన్న పాల్గొన్నారు.
Advertisement
Advertisement