కార్పొరేషన్లో అవినీతిపై విచారణకు వినతి
కార్పొరేషన్లో అవినీతిపై విచారణకు వినతి
Published Thu, Sep 1 2016 11:58 PM | Last Updated on Sat, Oct 20 2018 6:29 PM
నెల్లూరు(పొగతోట): నెల్లూరు కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై జిల్లా యంత్రాంగం విచారణ జరిపించాలని డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకనాథ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఫ్లోర్‌లీడర్ రూప్‌కుమార్‌యాదవ్ కోరారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ ముత్యాలరాజుకు వినతిపత్రం సమర్పించిన అనంతరం వారు మాట్లాడారు. రెండేళ్లుగా జరుగుతున్న అవినీతి, అక్రమాలపై రికార్డులను పరిశీలించాలని కలెక్టర్‌ను కోరారు. అనేక ప్రధాన శాఖలకు ఉన్నతాధికారుల్లేని విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. 11 నెలలుగా కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించలేదని, త్వరలో నిర్వహించేలా ఆదేశాలివ్వాల్సిందిగా కలెక్టర్‌ను కోరారు. సబ్‌ప్లాన్ నిధులకు సంబంధించిన టెండర్లను పిలవకపోవడాన్ని కలెక్టర్‌కు తెలియజేశారు. సమస్యలపై సానుకూలంగా స్పందిస్తామన్న కలెక్టర్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలను తెలియజేశారు. కార్పొరేటర్లు లేబూరు పరమేశ్వరరెడ్డి, బొబ్బల శ్రీనివాసయాదవ్, ఓబిలి రవిచంద్ర, ఊటుకూరు మాధవయ్య, గోగుల నాగరాజు, ఖలీల్ అహ్మద్, వేలూరు సుధారాణి, దేవరకొండ అశోక్, పార్టీ నాయకులు వేలూరు మహేష్, కుంచాల శ్రీనివాసులు, వందవాసి రంగా, సత్తార్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement