గద్వాలను జిల్లాగా ప్రకటించాలని ధర్నా | congres protest to declare gadwal district | Sakshi
Sakshi News home page

గద్వాలను జిల్లాగా ప్రకటించాలని ధర్నా

Published Fri, Jul 1 2016 12:56 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

congres protest to declare gadwal district

గద్వాల: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించినప్పటి నుంచి పలు ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. మహబూబ్నగర్ జిల్లా గద్వాల కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని ఆ ప్రాంతవాసులు తీవ్రంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో 44 వ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. ధర్నాలో కాంగ్రెస్ నేతలు డీకే అరుణ, సంపత్ కుమార్లతో పాటు పలువురు పాల్గొన్నారు. రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో.. పోలీసులు నేతలను అరెస్ట్ చేశారు. గద్వాలను జిల్లాగా ప్రకటించాల్సిందేనని నేతలు పట్టుబడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement