'కాల్పులు జరిపిన చరిత్ర కాంగ్రెస్దే' | congress dont have right to talk about farmers | Sakshi
Sakshi News home page

'కాల్పులు జరిపిన చరిత్ర కాంగ్రెస్దే'

Published Mon, Sep 7 2015 2:02 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

congress dont have right to talk about farmers

హైదరాబాద్: రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ అన్నారు. రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రులుగా ఉండి దాడులు చేసినవారు ఇప్పుడు తమపై విమర్శలు చేస్తారా అని నిలదీశారు. కేంద్రంతో గొడవపడాలని తాము కోరుకోవడం లేదని ఆయన చెప్పారు. కేవలం తమ హక్కుల కోసమే పోరాడతామని బాల్క సుమన్ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement