
'టీఆర్ఎస్ నేతలు వేధిస్తున్నారు'
తెలంగాణ సర్కార్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గీతారెడ్డి మండిపడ్డారు.
మెదక్: తెలంగాణ సర్కార్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గీతారెడ్డి మండిపడ్డారు. ఆమె శనివారం విలేకర్లతో మాట్లాడుతూ జహీరాబాద్ టీఆర్ఎస్ నేతలు తనను వేధిస్తున్నారని ఆరోపించారు. సొంత నియోజక వర్గంలో పర్యటించకుండా అడ్డుకుంటున్నారన్నారు. దళిత మహిళా ఎమ్మెల్యే అయినందుకే నన్ను వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మెదక్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన స్పందన లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్టు ఆమె తెలిపారు.