బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు పద్మ
హన్మకొండ: కుంభకోణాలు చేయడం కాంగ్రెస్‌కే తెలుసునని, బీజేపీని విమర్శించే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదని బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. బుధవారం హన్మకొండ హంటర్‌రోడ్డులోని బాంక్వెట్‌హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఏఐసీసీ కోఆర్డినేటర్ విశ్వనాథ్ బీజేపీపై చేసిన విమర్శలు అర్థరహితమన్నారు. పెద్ద నోట్లు రద్దుతో మోదీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు.
రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ నాయకులు దిక్కుమాలిన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో బీజేపీ నాయకులు మారెపల్లి రాంచంద్రారెడ్డి, సదానందం, జగదీశ్వర్, కొలను సంతోష్‌రెడ్డి, కొత్త రవి, శ్రీహరి, రవినాయక్, కుమార్, డి.శ్రీనివాస్ పాల్గొన్నారు
కుంభకోణాలు కాంగ్రెస్‌కే సొంతం
Published Thu, Jan 5 2017 10:55 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement