
స్కాములపై చర్యలేవీ?
వారణాసి: స్కాములపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికల ముందే ఓ అవగాహనకు వచ్చాయని ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. మంగళవారం ఆయన వారణాసిలో మీడియాతో మాట్లాడారు. మహిళపై మోడీ ప్రభుత్వం నిఘా పెట్టినట్లు వచ్చిన ఆరోపణలపై కాంగ్రెస్, రాబర్ట్ వాద్రా భూ కబ్జాపై బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఆ పార్టీలు పరస్పరం విమర్శించుకుంటూ.. కుంభకోణాలపై మాత్రం స్పందించడం లేదని మండిపడ్డారు.