
జయలలిత మృతికి పుష్పాంజలి
అనంతపురం అర్బన్ : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతికి ప్రభుత్వం సంతాప దినాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో ముఖ్యమంత్రి జయలలితకు సంతాప కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. జయలలిత చిత్రపటానికి కలెక్టర్ పుష్పాంజలి ఘటించారు. కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చిన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం జయలలితకు సంతాప సూచికంగా కలెక్టర్, ఎమ్మెల్యే, సిబ్బంది రెండు నిమిషాలు మౌనం పాటించారు. కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జయలలిత వినూత్న ఆలోచనలతో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు చేరువయ్యారన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ సి.మల్లీశ్వరిదేవి, అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.