
67వ పడిలోకి అడుగుపెట్టిన 'అమ్మ'
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత (అమ్మ) మంగళవారం 67వ పడిలోకి అడుగుపెట్టారు.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత (అమ్మ) మంగళవారం 67వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అమ్మ పేరిట పూజలు నిర్వహిచంటంతో దేవలయాలన్నీ కిక్కిరిసిపోయాయి.
యుద్ధ కళల్లో నైపుణ్యం ఉన్న జయ విశ్వాసపాత్రుడు షిహాన్ హుస్సెయినీ తనకు తాను శిలువ వేయించుకుని ఆరు నిమిషాలపాటు ఉన్నాడు. అమ్మకు ఇక ముందంతా జయం కలగాలని జయజయద్వానాలు చేశారు. జయ రూ.66.66 కోట్ల ఆస్తులు అక్రమంగా కలిగి ఉన్నారనే ఆరోపణలతో బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు అరెస్టు చేసి జైలులో పెట్టిన విషయం తెలిసిందే. అయితే, అనంతరం ఆమె కర్ణాటక హైకోర్టులో ఆ తీర్పును సవాల్ చేసి బెయిల్పై విడుదలయ్యారు.