నిధుల వెల్లువ
► సీడీపీ కింద జిల్లాకు రూ.16.50 కోట్లు
► ఏడుగురు ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలకు నిధులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాకు నిధులు వెల్లువెత్తాయి. నియోజకవర్గ అభివృద్ధి నిధి (సీడీపీ) కింద రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.16.50 కోట్లను విడుదల చేసింది. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు ప్రతి ఏటా రూ.1.50 కోట్లను ప్రభుత్వం కేటాయి స్తోంది. ఇందులోభాగంగా ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా పరిధిలోని షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఎల్‌బీనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, రాజేంద్రనగర్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు, జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహి స్తున్న నలుగురు ఎమ్మెల్సీలకు సంబంధించి రూ.16.50 కోట్లు విడుదల చేసింది.
సీడీపీ నిధులు ఆలస్యం కావడంతో గ్రామాల్లో చాలావరకు పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హామీల వర్షం కురిపించినా.. పనులకు సంబంధించిన ప్రతిపాదనలు పంపించినా నిధులు రాకపోవడంతో అభివృద్ధి పనులు ఆగిపోయాయి. దీనికితోడు స్థానిక సంస్థల నిధులకు ప్రభుత్వం కోత విధించడం, వివిధ పద్దుల కింద నిధుల రాక కూడా తగ్గిపోవడంతో ఈ నిధులకు డిమాండ్ పెరిగింది.
అదేస్థాయిలో ఎమ్మెల్యే/ఎమ్మెలీ్సలపై ఒత్తిడి ఏర్పడింది. మండల పరిషత్, గ్రామ పంచాయతీలకు రావాలి్సన బదలాయింపు సుంకం, సీనరేజీ నిధులకు మంగళం పాడడం.. సాధారణ నిధులు కూడా కరిగిపోవడంతో స్థానిక సంస్థల ప్రతినిధులు సీడీపీ నిధులపైనే ఆశలు పెట్టుకున్నారు. ఎమ్మెల్యేలు కూడా ఈ నిధులు వస్తాయనే నమ్మకంతో హామీల వర్షం కురిపించారు. దీంతో ఇపు్పడు.. అపు్పడు అంటూ ఊరిస్తూ వచ్చిన నిధులను ఎట్టకేలకు ప్రభుత్వం విడుదల చేయడంతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతమయ్యే అవకాశముంది. కాగా, ప్రస్తుతం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరుగుతున్నందున.. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం అంటే ఈ నెల 18వ తేదీ వరకు కొత్త పనులకు బ్రేక్ పడనుంది.