development of rural areas
-
నిధుల వెల్లువ
► సీడీపీ కింద జిల్లాకు రూ.16.50 కోట్లు ► ఏడుగురు ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలకు నిధులు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాకు నిధులు వెల్లువెత్తాయి. నియోజకవర్గ అభివృద్ధి నిధి (సీడీపీ) కింద రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.16.50 కోట్లను విడుదల చేసింది. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు ప్రతి ఏటా రూ.1.50 కోట్లను ప్రభుత్వం కేటాయి స్తోంది. ఇందులోభాగంగా ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా పరిధిలోని షాద్నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, రాజేంద్రనగర్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు, జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహి స్తున్న నలుగురు ఎమ్మెల్సీలకు సంబంధించి రూ.16.50 కోట్లు విడుదల చేసింది. సీడీపీ నిధులు ఆలస్యం కావడంతో గ్రామాల్లో చాలావరకు పనులు పెండింగ్లో ఉన్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హామీల వర్షం కురిపించినా.. పనులకు సంబంధించిన ప్రతిపాదనలు పంపించినా నిధులు రాకపోవడంతో అభివృద్ధి పనులు ఆగిపోయాయి. దీనికితోడు స్థానిక సంస్థల నిధులకు ప్రభుత్వం కోత విధించడం, వివిధ పద్దుల కింద నిధుల రాక కూడా తగ్గిపోవడంతో ఈ నిధులకు డిమాండ్ పెరిగింది. అదేస్థాయిలో ఎమ్మెల్యే/ఎమ్మెలీ్సలపై ఒత్తిడి ఏర్పడింది. మండల పరిషత్, గ్రామ పంచాయతీలకు రావాలి్సన బదలాయింపు సుంకం, సీనరేజీ నిధులకు మంగళం పాడడం.. సాధారణ నిధులు కూడా కరిగిపోవడంతో స్థానిక సంస్థల ప్రతినిధులు సీడీపీ నిధులపైనే ఆశలు పెట్టుకున్నారు. ఎమ్మెల్యేలు కూడా ఈ నిధులు వస్తాయనే నమ్మకంతో హామీల వర్షం కురిపించారు. దీంతో ఇపు్పడు.. అపు్పడు అంటూ ఊరిస్తూ వచ్చిన నిధులను ఎట్టకేలకు ప్రభుత్వం విడుదల చేయడంతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతమయ్యే అవకాశముంది. కాగా, ప్రస్తుతం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరుగుతున్నందున.. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం అంటే ఈ నెల 18వ తేదీ వరకు కొత్త పనులకు బ్రేక్ పడనుంది. -
యువతతోనే మార్పు
గ్రామీణాభివృద్ధిలో వారి భాగస్వామ్యం పెరగాలి: ప్రధాని మోదీ న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో యువత భాగస్వామ్యం మరింత పెరగాలని, అప్పుడే మార్పు సాధ్యమవుతుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానమంత్రి గ్రామీణాభివృద్ధి సారథుల(పీఎంఆర్డీఎఫ్) పథకంలో పనిచేస్తున్న 230 మంది యువకులతో సోమవారమిక్కడ ఆయన సమావేశమయ్యారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో పీఎంఆర్డీఎఫ్ సిబ్బంది చేస్తున్న కృషి గొప్పదని ప్రధాని కొనియాడారు. పథకంలో భాగంగా తాము చేస్తున్న పనిని సిబ్బంది మోదీకి వివరించారు. గ్రామీణ, మారుమూల, గిరిజన, నక్సల్స్ ప్రభావ ప్రాంతాల్లో కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అధికారులతో కలిసి మహిళా సాధికారత, మాత, శిశు సంరక్షణ, విద్య, పౌష్టికాహారం, స్వచ్ఛభారత్, ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్, పాలనలో ప్రజల భాగస్వామ్యం తదితర కార్యక్రమాల్లో తాము చేస్తున్న కృషిని వివరించారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, గ్రామీణ విద్య, గిరిజనాభివృద్ధి, సేంద్రియ సాగు, వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్న తీరును వివరించారు. పీఎండీఆర్ఎఫ్ పథకాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి అమలు చేస్తోంది. పేదరిక నిర్మూలన, జీవన ప్రమాణాలు పెంపు ఈ పథకం ఉద్దేశం. పథకం కింద ఎంపికైన యువతీ యువకులు జిల్లా అధికారులతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ప్రజలు-వారి అవసరాలు-పాలన మధ్య ఉన్న అంతరాన్ని పూడుస్తూ, ప్రభుత్వానికి జనానికి మధ్య వారు(ఫెల్లోస్) వారధిలా ఉండాలి. -
పంచాయతీ రాజ్ చట్టానికి త్వరలో మార్పులు
మంత్రి హెచ్.కే పాటిల్ సాక్షి, బెంగళూరు : గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతం చేయడంతో పాటు పనుల్లోపారదర్శకత పెంచేలా పంచాయతీ రాజ్ చట్టానికి త్వరలో మార్పులు చేయనున్నట్లు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి హెచ్.కె.పాటిల్ తెలిపారు. హుబ్లీలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. నూతన చట్టం వల్ల అధికారులతో పాటు గ్రామ పంచాయతీ సభ్యులోనూ జవాబుదారీ తనం పెరుగుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు రూపొందించిన ముసాయిదాను వచ్చే అక్టోబర్లో జరగనున్న శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి కోసం అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోనున్నట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన పరిశోధనల కోసం దేశంలోని తొలిసారిగా రాష్ట్రంలో గ్రామీణ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పబోతున్నట్లు పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ చైతన్య పథకం కింద ప్రతి గ్రామీణ పంచాయతీ పరిధిలో 40 మంది నిరుద్యోగులను ఎంపిక చేసి వారి అర్థలకు గ్గ రంగంలో శిక్షణ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించున్నట్లు చెప్పారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. వీటి వితరణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు.