కథలు కళ్లకు కట్టినట్లు
చిన్నప్పుడు అమ్మానాన్నలు కథలు చెబుతుంటే కథలోని పాత్రలను, వాటి చర్యలను మనమే ఊహించుకునే వాళ్లం. అలా చిన్న వయసులోనే సృజనాత్మకత, ఆలోచనా శక్తి పెంపొందేవి. నేడు విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పుల దృష్ట్యా నూతన బోధనా పద్ధతులు వస్తున్నాయి. విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే విధంగా ఫొటోలను, మ్యాప్‌లను, ఊహా చిత్రాలను పాఠ్యపుస్తకాల్లో పొందుపరుస్తున్నారు. ప్రస్తుతం పాఠ్య పుస్తకాల్లో రంగు రంగుల బొమ్మలను ఉపయోగిస్తూ విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా చూస్తున్నారు. ఆంగ్ల మాధ్యమ పుస్తకాల్లో కథలకు సంబంధించినవే పై ఫొటోలు. కథను కళ్లకు కట్టించినట్లుగా ఉన్నాయి కదా పై చిత్రాలు. ఆంగ్ల మాధ్యమానికి సంబంధించిన 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్న వివిధ పాఠ్యపుస్తకాల్లో బోధన అంతా ఇదే శైలిలో సాగుతోంది. – ఆదిలాబాద్ టౌన్