నల్లగొండ : నగదు రహిత లావాదేవీలపై అన్ని శాఖలు సమన్వయంతో ముందుకుపోవాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. నగదు రహిత కార్యక్రమాలపై మండల ప్రత్యేకాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ముందుగా గుర్తించిన 11 గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెడుతూనే మిగతా గ్రామాల్లో ఆచరణయోగ్యంగా నగదు రహిత అవగాహన కార్యక్రమాలపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. ఎంపిక చేసిన 11 గ్రామా లు ఏడు మండలాల్లో ఉన్నాయని, మిగతా 24 మండలాలల్లోనూ ఒక్కొక్క గ్రామాన్ని నగదు రహిత గ్రామంగా చేసేందుకు కృషి చేయాలని చెప్పారు. శుక్రవారం నుంచి గ్రామ కమిటీల ద్వారా ఇంటింటి సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. సర్వే నివేదిక ప్రకారంగా అకౌంటు లేని వారికి ఓపెన్ చేస్తామన్నారు.
పూర్తి నగదు రహితంగా ఎంపి క చేసిన గ్రామాల్లో చౌకధరల దుకాణం, చిన్న చిన్న వ్యాపారులకు పాస్‌మిషన్‌లు, పేటీఎంలు ఏర్పాటు చేస్తామని వివరించారు. ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ 48 గ్రామాలను ఎంపిక చేశామని, మండల ప్రత్యేకాధికారులు, శాఖ సంయుక్తంగా అవగాహన, సర్వే పనులు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఒక్కొక్కగ్రామానికి ఎస్‌ఐ, సీఐను కేటాయించడంతో పాటుగా నగదు రహిత లావాదేవీలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించని వారిపై జరిమానా చెల్లింపు కోసం మూడు సబ్ డివిజన్లకు మూడు పాస్ మిషన్లు పంపిణీ చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంకు అధికారి సూర్యం, డీఆర్‌ఓ కీమ్యానాయక్, డీఆర్‌డీఓ అంజయ్య, పాల్గొన్నారు.
అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలి
Published Wed, Dec 28 2016 12:51 AM | Last Updated on Thu, Mar 21 2019 8:24 PM
Advertisement