ఉద్యోగులకు కార్పొరేట్ వైద్యం!
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారుల ఆరోగ్య కార్డుల అమలుపై సర్కారు కసరత్తు ప్రారంభించింది. ఈ నెల 21న సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఆరోగ్యశ్రీ ట్రస్టు బోర్డు సమావేశంలో దీనిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఉద్యోగుల ఆరోగ్య కార్డుల అమలు, ప్యాకేజీ పెంపు, ఉచిత ఓపీ వంటి వాటిపై ఏదో ఒక నిర్దిష్ట నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయి. మరోవైపు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు రూ. 200 కోట్లకు పైనే ఉన్నాయి. దీంతో ఆయా ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ రోగుల రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా నిలిపేశాయి. ఈ నెల 23 వరకు బకాయిల చెల్లింపునకు గడువిస్తూ కార్పొరేట్ ఆసుపత్రులు సర్కారుకు అల్టిమేటం ఇచ్చాయి.ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీకి నేరుగా నిధులు కేటాయించే విషయంపైనా దృష్టి సారించనున్నారు.
మెలికల మీద మెలికలు
ఆరోగ్యకార్డుల అమలుపై సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అనేక మెలికలు పెడుతున్నాయి. ఇంతకుముందు ఆయా ఆసుపత్రులు చేసిన డిమాండ్‌కు సర్కారు సిద్ధమయ్యే సరికి... తర్వాత అదే డిమాండ్‌ను మార్పు చేసి కొత్త అడ్డంకులు సృష్టిస్తున్నాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అంటున్నారు. గతంలో ఆరోగ్యకార్డుల శస్త్రచికిత్స ప్యాకేజీని 25 శాతం పెంచాలని కార్పొరే ట్లు ప్రభుత్వాన్ని కోరాయి. దానికి మొదట్లో ప్రభుత్వం ససేమిరా అంది. 10 లేదా 15 శాతానికి మించి పెంచబోమని స్పష్టంచేసింది. చివరకు 25 శాతం పెంపునకు సర్కారు సిద్ధమైంది. కానీ ఆ తర్వాత కార్పొరేట్ ఆసుపత్రులు 40 శాతం పెంచాలని చెప్పాయి. దీంతోఆ ఆసుపత్రుల్లో ఉద్యోగుల ఆరోగ్యకార్డుల అమలు ఏడాదిగా పెండింగ్‌లో ఉండిపోయింది.
ఓపీపై ప్రతిష్టంభన
ఉద్యోగులకు ఓపీ సేవలు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదించగా ఎంతోకొంత ఫీజు వసూలు చేయాల్సిందేనని కార్పొరేట్ యాజమాన్యాలు చెప్పా యి. దీనిపై ఇప్పటికీ ప్రతిష్టంభన కొనసాగుతోంది. వైద్య పరీక్షలకు ఉద్యోగులు నెలనెలా ప్రీమియం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ అం శాన్ని పరిష్కరించడంలో సర్కారు విఫలమైంది. అలాగే మెడికల్ ప్యాకేజీని నిమ్స్, సీజీహెచ్‌ఎస్ ధరలకు అనుగుణంగా పెంచాలని యాజమాన్యాల ప్రతి నిధు లు కోరుతున్నారు. మందులకు సంబంధించి సేకరణ ధర కాకుండా ఎంఆర్‌పీని కొనసాగించాలని కోరుతున్నారు.సూపర్ స్పెషాలిటీలు కోరుతున్నటు ్లగా నిమ్స్ మాదిరి మెడికల్ ప్యాకేజీ, ఓపీకి చెల్లిస్తే రూ. 500 కోట్ల మేర ప్రభుత్వంపై అదనపు భారం పడుతుం దని వైద్యఆరోగ్యశాఖ అధికారులు అంచనా వేశారు.