హైదరాబాద్: పేదల పెన్నిధిగా ఉన్న 'ఆరోగ్యశ్రీ'ని అనారోగ్యశ్రీ పథకంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం మార్చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ ధ్వజమెత్తింది. డా.వైఎస్ రాజశేఖరరెడ్డి మానసపుత్రిక అయిన ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించింది. మొత్తం దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈ పథకాన్ని ప్రారంభించి, 920 రుగ్మతలకు వైద్యసేవలు అందించిన ఘనత దివంగత నేత వైఎస్సార్‌దేనని పేర్కొంది. వైఎస్సార్ హయాంలో 2007లో మొదట మూడు జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రారంభించి, ఆ తర్వాత అన్ని జిల్లాలకు వర్తింపజేసి పకడ్బందీగా అమలు చేసిన విషయాన్ని గుర్తుచేసింది.
కేసీఆర్ సీఎం అయ్యాక బిల్లులను సకాలంలో చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలను ప్రైవేట్ ఆసుపత్రులు ఆరుసార్లు బంద్ పెట్టాయని ఆ పార్టీ ప్రధానకార్యదర్శి కొండా రాఘవరెడ్డి విమర్శించారు. ఏ ఏడాదికి ఆ ఏడాది బతుకమ్మ నిర్వహణకు నిధులు పెంచుతూ ఈ ఏడాది రూ.35 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, ఆరోగ్యశ్రీ అంటే ఎందుకంత నిర్లక్ష్యం చూపుతుందో చెప్పాలని ప్రశ్నించారు. మంగళవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రైవేట్ ఆసుపత్రుల ఆరోగ్యశ్రీ బకాయిలను వెంటనే విడుదల చేసి, భవిష్యత్‌లో మళ్లీ ఈ సేవలు స్తంభించకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
'అనారోగ్యశ్రీగా మారుస్తున్న సీఎం కేసీఆర్'
Published Tue, Oct 4 2016 6:24 PM | Last Updated on Thu, Aug 30 2018 9:15 PM
Advertisement
Advertisement