పేద గుండెకి అండ ఎవ్వరు | Support poor heart ever | Sakshi
Sakshi News home page

పేద గుండెకి అండ ఎవ్వరు

Published Mon, Mar 24 2014 2:06 AM | Last Updated on Sat, Sep 22 2018 8:06 PM

పేద గుండెకి అండ ఎవ్వరు - Sakshi

పేద గుండెకి అండ ఎవ్వరు

 ఒక్కో చిన్నారికి కాక్లియర్ ఇంప్లాంట్స్ వేస్తే రూ.6.50 లక్షలు ఖర్చవుతాయి.
వైఎస్ పాలనలో ఏటా 300కు పైగా ఇంప్లాంట్స్ వేసేవారు.

 

 

 చిన్నారి గుండె కు రంధ్రం పడ్డా.. పెద్దాయనకు కేన్సర్ వచ్చినా.. అవ్వకు కిడ్నీ జబ్బు చేసినా.. నేనున్నానంటూ భరోసా ఇచ్చిన పథకం  ఆరోగ్యశ్రీ. శ్రీమంతులకే పరిమితమైన ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని పేదల ముంగిట నిలిపింది. 2007లో వైఎస్ ప్రారంభించిన ఈ పథకం ద్వారా లక్షలాది మంది పునర్జన్మ పొందారు. కానీ ఇప్పుడు ఈ అపర సంజీవనిని పట్టించుకునే నాథుడే లేడు.

 

 వైఎస్ రాజశేఖర రెడ్డి 2007లో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు.  పేదల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించి, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అందించేలా ప్రణాళిక రూపొందించారు. ఖరీదైన చికిత్స అవసరమైన జబ్బులను ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చారు.

     
తొలి దశగా 2007 ఏప్రిల్1న మహబూబ్‌నగర్, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో 163 జబ్బులతో ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారు.

    
  రెండవ దశలో భాగంగా 2007 డిసెంబర్ నాటికి ఈ పథకం కింద మరో ఐదు జిల్ల్లాలను (చిత్తూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, రంగారెడ్డి, నల్లగొండ) చేర్చారు. రెండో దశలో 163 జబ్బుల నుంచి 272 జబ్బులకు పెంచారు.

     
మూడవ దశలో భాగంగా 2008 ఏప్రిల్‌లో ఆరోగ్యశ్రీ  పథకంలోకి  కడప, కరీంనగర్, మెదక్, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను చేర్చి, చికిత్సల సంఖ్య 332కు పెంచారు.

     
2008 జూలై నాటికి మిగిలిన పది జిల్లాలను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి, పథకం పరిధిలోకి ఏకంగా 942 జబ్బులను చేర్చారు. అంటే సరిగ్గా ఏడాదిన్నరలో పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసిన ఘనత దక్కించుకున్నారు.

     
ఆరోగ్యశ్రీ ప్రారంభమైన నాటినుంచి ఇప్పటి వరకూ లబ్ధి పొందిన వారు 23 లక్షల మంది పైనే. ఇందులో ఆరు లక్షల మంది ప్రభుత్వాసుపత్రుల్లోనూ, 16 లక్షల మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నారు.

     
గుండెజబ్బులు, కిడ్నీ (డయాలసిస్ రోగులు), నరాల జబ్బులు, కేన్సర్, కాక్లియర్ ఇంప్లాంట్ లాంటి ఖరీదైన జబ్బులతో బాధపడే వారు ఎక్కువ శాతం మంది ఆరోగ్యశ్రీ కింద లబ్ధి పొందారు.

     
పుట్టుకతోనే గుండె జబ్బులొచ్చిన నిరుపేద చిన్నారులెందరో ఆరోగ్యశ్రీతో పునర్జన్మ పొందారు.
రోజూ రెండు వేల వరకూ శస్త్రచికిత్సలు జరిగేవి. రోజూ రూ.2 కోట్లు పైనే వాటికి వెచ్చించేవారు.
నిత్యం ఆరోగ్యశ్రీ హెల్త్ క్యాంపులు జరిగేవి. రోజూ పాతికవేల మంది ఔట్‌పేషెంట్లు సేవలు పొందేవారు.
ఆరోగ్యశ్రీ పథకానికి ఏటా రూ.925 కోట్లు కేటాయించేవారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.350 కోట్లు ఇచ్చేవారు.
ఆరోగ్యశ్రీ పథకంలో అత్యంత ఖరీదైన చికిత్స  కాక్లియర్ ఇంప్లాంట్. పుట్టుకతోనే చెవిటి, మూగతో పుట్టే వారిని శాశ్వత వైకల్యం నుంచి బయటపడేసేదే ఈ చికిత్స.



 బాబోయ్...



చంద్రబాబు తన హయాంలో వైద్య, ఆరోగ్యరంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ప్రజలు సరైన వైద్య సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడేవారు.

 ప్రభుత్వాసుపత్రుల్లో తగినంత మంది వైద్యులుండేవారు కాదు. ఇతర సిబ్బందీ అరకొరగానే ఉండేవారు. వైద్య పరికరాలు ఎప్పుడూ మరమ్మత్తులోనే ఉండేవి.

 


 2002లో ప్రభుత్వాసుపత్రులకు వచ్చే పేద రోగులతోనూ యూజర్ చార్జీలు వసూలు చేశారు.

 మందులు బయటినుంచి తెచ్చుకోవాల్సిందే. ఏవైనా సేవలు కావాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే. పేద రోగుల పరిస్థితి దారుణంగా ఉండేది. చికిత్స సరిగా జరగదేమోనన్న భయంతో ప్రభుత్వాసుపత్రులకు వెళ్లలేక, ప్రై వేటు, కార్పొరేటు ఆసుపత్రుల్లో చికిత్సకయ్యే ఖర్చు భరించలేక కొట్టుమిట్టాడేవారు.

 

 రోగశయ్యపై...


శస్త్ర చికిత్సల సంఖ్య 2 వేల నుంచి 700 లకు పడిపోయింది.
గతంలో శస్త్రచికిత్సలపై రోజూ అయ్యే వ్యయం రూ. 2 కోట్ల నుంచి రూ. 30 లక్షలకు తగ్గింది.
మొత్తం 938 జబ్బుల్లోంచి 133 జబ్బులకు కేవలం ప్రభుత్వాసుపత్రుల్లోనే చికిత్స చేయాలని 2010 నవంబర్‌లో నిర్ణయించారు.
2012-13 బడ్జెట్‌లో రూ.925 కోట్లు  కేటాయించినా అందులో రూ.470 కోట్లు ఇవ్వలేదు.

 

 వైఎస్ హయాంలో సజావుగా అమలైన ఆరోగ్యశ్రీ.. ఆ తరువాత రోశయ్య, కిరణ్ పాలనలో పూర్తిగా కుంటుపడింది. నిధుల విడుదలలో జాప్యం, పథకం అమలుపై పర్యవేక్షణ లేకపోవడంతో దాదాపు ఆగిపోయే పరిస్థితి నెలకొంది.

     
2013-14 బడ్జెట్‌లో 8 నెలలకు గానూ రూ.450 కోట్లు మాత్రమే ఇచ్చారు.
2009లో ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల అభివృద్ధి కోసం రూ.55 కోట్లు కేటాయిస్తే 2013 నాటికి కూడా వినియోగించుకోలేని పరిస్థితి.
  కాక్లియర్ ఇంప్లాంట్స్‌కు ఉన్న గరిష్ట వయో పరిమితిని రెండేళ్లకు కుదించారు. ఇప్పుడు ఏటా 50 ఇంప్లాంట్స్ కూడా జరగడం లేదు.
ఆరోగ్యశ్రీ సేవలందించేందుకు ప్రైవేటు ఆసుపత్రులు ఆసక్తి చూపడం లేదు. నిధులు ఇవ్వడం లేదని, కొన్ని జబ్బులకు కనీస ప్యాకేజీలు కూడా ఇవ్వట్లేదని అవి విమర్శిస్తున్నాయి.
తమ ఆస్పత్రిని ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల జాబితా నుంచి తొలగించాలని  నిమ్స్ లాంటివే ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు లేఖ రాశాయి
{పభుత్వాసుపత్రులను కనీస వసతుల లేమి వేధిస్తోంది.

     

వెంటిలేటర్లు, రేడియంట్ వార్మర్స్ (శిశువులకు కామెర్ల చికిత్సకు ఉపయోగించే బాక్సులు), ఐసీయూలు, సీటీ స్కానర్లు, ఎక్స్‌రే యంత్రాలు లేవు. వైద్య విధానపరిషత్ పరిధిలోని ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉన్నట్టు వైద్యాధికారులే తేల్చారు.

    
 
ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ పరిధిలోని 131 ప్రభుత్వ ఆస్పత్రుల్లో  125 ఆస్పత్రులు మౌలిక వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి.
హెల్త్‌కేర్ ట్రస్ట్ అధికారులు నిఘా వేయగా పలు ప్రభుత్వాసుపత్రుల్లో రోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు వెల్లడైంది.{పభుత్వాసుపత్రుల్లో ఔట్‌పేషెంట్లుగా వచ్చే వారిలో 60 శాతం మంది ఇన్‌పేషెంట్లుగా చేర్చాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ 10 శాతం మందిని కూడా చేర్చుకోవడం లేదు.

     
ఆరోగ్యశ్రీని సరిగా అమలు చేయడానికి వేల కోట్లు అక్కర్లేదు. ఏటా ఇస్తున్న రూ.925 కోట్లు, సీఎం సహాయ నిధి కింద ఇస్తున్న రూ.350 కోట్లు సకాలంలో ఇచ్చి, ఆస్పత్రి అభివృద్ధి సొసైటీల నిధులపై పర్యవేక్షణ చేస్తే చాలు.

 

 మళ్లీ సంక్షేమం...

 

 ఆరోగ్యశ్రీ అమలులో వైఫల్యంపై ఇప్పటి వరకూ స్పందించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరే. అధికా రంలోకి రాగానే ఆరోగ్యశ్రీని కట్టుదిట్టంగా అమలు చేస్తామని, పథకం నిర్దిష్ట అమలు, నిధుల కేటాయింపు, ప్రభుత్వ పర్యవేక్షణ మొదలైన వాటిపై దృష్టి పెడతామని ఆయన హామీ ఇస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement