ఆవులను అప్పగిస్తున్న యువకులు
నిర్మల్‌రూరల్ : భైంసాలో అక్రమంగా తరలిస్తుండగా హిందూవాహిని సభ్యులు పట్టుకున్న గోవులు శనివారం నిర్మల్‌లోని గాయత్రీ గోశాలకు చేర్చారు. భైంసాలో హిందూవాహిని సభ్యులు పట్టుకున్న ఆవులను స్థానిక పోలీసులకు అప్పజెప్పగా.. అక్కడి పట్టణ సీఐ రఘు వివిధ గోశాలలను సంప్రదించారు. పశుగ్రాసం కొరతతో ఆయా గోశాలల వారు ముందుకు రాలేదు. చివరకు నిర్మల్‌లోని బంగల్‌పేట్ మహాలక్ష్మి ఆలయ సమీపంలోని గాయత్రీగోశాలను సంప్రదించి, వాటిని ఇక్కడకు పంపించారు.
గోశాల నిర్వాహకులు దోముడాల ప్రవీణ్‌కుమార్, స్థానిక హిందూవాహిని నాయకులు దొనగిరి మురళీ, విక్కీ తదితరులు వాటిని గోశాలకు తరలించారు. గోవులను స్వీకరించినందుకు భైంసా పట్టణ సీఐ అభినందించినట్లు ప్రవీణ్‌కుమార్ తెలిపారు. పశుగ్రాసం కొరతతోనే ఇబ్బంది ఉందని, దాతలు సహకరిస్తే మరిన్ని గోవులకు సేవలందిస్తామని ఆయన పేర్కొన్నారు.