'హోదా ఉద్యమం' లో విధ్వంసం | cpi and aap leaders arrested in anantapur | Sakshi
Sakshi News home page

'హోదా ఉద్యమం' లో విధ్వంసం

Published Tue, May 10 2016 12:26 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు ప్రకటించిన హామీని వెంటనే కేంద్రం నెరవేర్చాలని సీపీఐ, ఆమ్ ఆద్మీ పార్టీలు డిమాండ్ చేశాయి.

వాణిజ్యపన్నులశాఖ కార్యాలయంలో ఫర్నీచర దగ్ధం

అనంతపురం : ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు ప్రకటించిన హామీని వెంటనే కేంద్రం నెరవేర్చాలని సీపీఐ, ఆమ్ ఆద్మీ పార్టీలు డిమాండ్ చేశాయి. మంగళవారం ఆ పార్టీల ఆధ్వర్యంలో నాయకులు ఆందోళన చేపట్టారు. అందులోభాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక వాణిజ్యపన్నులశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు.

ఆ క్రమంలో కార్యాలయంలోకి ప్రవేశించి.. ఫర్నీచర్‌ను ద్వంసం చేశారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement