
సీపీఐ కార్యదర్శిగా మళ్లీ చాడ
సహాయ కార్యదర్శులుగా పల్లా, కూనంనేని
సాక్షి, హైదరాబాద్/వరంగల్: భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) రాష్ట్ర కార్యదర్శిగా సీనియర్ నేత చాడ వెంకటరెడ్డి మరోసారి ఎన్నికయ్యారు. ఇప్పటివరకు సహాయ కార్యదర్శిగా ఉన్న పల్లా వెంకటరెడ్డిని కొనసాగించడంతో పాటు కొత్తగా మరో సహాయ కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావును ఎన్నుకున్నారు. బుధవారం హన్మకొండలో ముగిసిన రాష్ట్ర పార్టీ నిర్మాణ మహాసభల్లో 31 మందితో రాష్ట్ర పార్టీ నూతన కార్యవర్గం ఏర్పడింది.
కార్యదర్శి, ఇద్దరు సహాయ కార్యదర్శులు, ఆరుగురు కార్యదర్శివర్గ సభ్యులు, 20 మంది కార్యవర్గ సభ్యులు, ఇద్దరు ఆహ్వానితులతో కొత్త కమిటీ ఏర్పాటైంది. ఇప్పటివరకు సహాయ కార్యదర్శిగా ఉన్న సిద్ధి వెంకటేశ్వర్లు అనారోగ్య కారణంతో వైదొలిగారు. రాష్ట్ర కార్యదర్శివర్గంలో సీనియర్ సభ్యుడిగా ఉన్న అజీజ్ పాషా తనకు తానుగా ఆ బాధ్యతల నుంచి వైదొలగగా.. జాతీయపార్టీలో ఆయనకు బాధ్యతలను అప్పగించనున్నట్లు సమాచారం.
పార్టీ రాష్ట్ర కమిటీ వివరాలు..
రాష్ట్ర కార్యదర్శి: చాడ వెంకటరెడ్డి , సహాయ కార్యదర్శులు: పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, కార్యదర్శివర్గ సభ్యులు: గుండా మల్లేశ్, ఈర్ల నరసింహ, పశ్య పద్మ, ఎం.ఆదిరెడ్డి, టి.శ్రీనివాసరావు, ఎస్.బాలమల్లేశ్, కార్యవర్గ సభ్యులు: కె.శ్రీని వాసరెడ్డి, వి.రత్నాకరరావు వి.సీతారామయ్య, టి.వెంకట్రాములు, బొమ్మగాని ప్రభాకర్, వీఎస్ బోస్, ఎన్.జ్యోతి, డి.సుధాకర్, టి.నరసింహన్, వి.సృజన, కలవేణ శంకర్, కె.రాంగోపాల్‌రెడ్డి, భాగం హేమంతరావు, ఎస్.కె.షాబ్బీర్‌పాషా, ఎం.బాలనరసింహ, మంద పవన్, ఇ.టి.నరసింహ, పల్లా నరసింహారెడ్డి, గోదా శ్రీరాములు, కె. భూమయ్య, కార్యవర్గ సభ్యులు(ఆహ్వానితులు): పి.నర్సింగ్‌రావు, కందాళ రామకృష్ణ.