
క్రీడలతో మానసికోల్లాసం
నెల్లూరు(అర్బన్): క్రీడలు మానసికోల్లాసానికి ఎంతో దోహదపడుతాయని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఆర్‌ఎం బీవీ శివయ్య పేర్కొన్నారు. స్థానిక కనుపర్తిపాడులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏపీజీబీ ఎంఏసీసీ సొసైటీ అంతర్ జిల్లా క్రికెట్ పోటీలను శనివారం ఆయన ప్రారంభించారు. వైఎస్సార్ కడప జిల్లా ఆర్‌ఎం కే రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల ఆట విడుపునకు క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం గెలుపొందిన క్రీడాకారులను అభినందించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఏసీసీ సొసైటీ అధ్యక్షుడు కే హనుమంతరావు, బ్యాంకు అధికారులు చంద్రమౌళిరెడ్డి, సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.