పిల్లల పండుగ..కనులకు వేడుక
-
నటన, కథారచన, చిత్రలేఖనం, శాస్త్ర ప్రదర్శనలు
-
వివిధాంశాల్లో ప్రతిభ చాటిన పాఠశాల చిన్నారులు
-
ముగిసిన ‘క్రియ’ ఫౌండేష¯ŒS రాష్ట్రస్థాయి వేడుక
నీటిలోని తామర నుంచి నింగిలోని తారక వరకూ.. అన్నీ చిన్నారులకు ఆసక్తిజనకాలే. వారి ముఖాలను పరిశీలనగా చూస్తే.. ప్రపంచంలోని ప్రతి దాన్నీ శోధిస్తున్న, మథిస్తున్న వారి బాలమేధస్సుకు ప్రతిబింబాల్లా కనిపిస్తాయి. అలాంటి వందల మంది బాలల సృజనాత్మకతకు, కళాత్మకతకు వేదికైంది.. కాకినాడలో క్రియ ఫౌండేష¯ŒS ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి బాలల పండుగ. శాస్త్ర విజ్ఞానం నుంచి శతకపద్యధారణం వరకు; యోగాసనాల నుంచి నట, నాట్య విన్యాసాల వరకూ పలు అంశాల్లో చిన్నారులు కనబరిచిన ప్రతిభాపాటవాలు ముచ్చటగొలిపాయి. అబ్బురపరిచాయి.
కాకినాడ కల్చరల్ :
జేఎ¯ŒSటీయూకే ప్రాంగణంలో క్రియ ఫౌండేష¯ŒS ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్ధాయి అంతర పాఠశాలల పిల్లల పండుగ పోటీలు ఆదివారంతో ముగిశాయి. సుమారు 600 పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొని వివిధ రంగాల్లో ప్రతిభను కనబరిచారు. సెలవు దినం కావడంతో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రతిభాపాటవాలను చాటి ఆకట్టుకొన్నారు. చివరి రోజున సాంస్కృతిక కార్యక్రమాలు సబ్ జూనియర్స్ విభాగంలో అధికంగా జరగడంతో ఎక్కడ చూసినా చిన్నారులు విలక్షణమైన వేషధారణలతో కనిపించి ముచ్చట గొలిపారు. చిట్టి చేతులతో సైన్సు ప్రయోగాలు చేసి శభాష్ అనిపించుకున్నారు. సౌరశక్తి వినియోగం, బంగాళాదుంపలతో సెల్ చార్జింగ్, రైల్వే క్రాసింగ్‌లలో ఆటోమేటిక్ గేట్లు, అద్దాల పొయ్యితో వేడి శాతం పెంచడం తదితర ప్రయోగాలను ప్రదర్శించారు. పద్యధారణలో పోతన మహాకవి మహాభాగవతం పద్యాలను, వేమన పద్యాలను, శతక పద్యాలను లయబద్ధంగా ఆలపించి వీనుల విందు చేశారు. చక్రాసనం, అర్ధమత్సే్యంద్రాసనం, ఏకపాద రాజ కపోతాసనం, ధనురాసనం, మయూరాసనం, పూర్ణ భుజంగాసనం, నటరాజాసనాలతో ఆశ్చర్యపరిచారు. ‘చిన్నికృష్ణుడమ్మ..., ఘల్లుఘల్లు జోడేళ్ల..., కొండమనదిరో కోనమనదిరో...’ వంటి శాస్త్రీయ, జానపద, గిరిజన నృత్యాలను ప్రదర్శించి ఆకట్టుకొన్నారు. చిత్రలేఖనం పోటీల్లో ‘దీపావళి, మై ఫ్యామిలీ, మై డ్రీమ్ విలేజ్, సహాయం, స్త్రీ, పురుషుల సమానత్వం, కన్నుతో ప్రపంచాన్ని చూడడం’ వంటి అంశాలను కళ్ళకు కట్టించే బొమ్మలను సృజించారు. కథా రచన విభాగంలో గ్రామీణ నాగకరిత ఉట్టిపడే కథలను, ఆలోచింప చేసే కథలను రాశారు. దుర్యోధనుడు, అల్లూరి సీతారామరాజుడిగా బాలల ఏకపాత్రాభినయంతో స్ఫూర్తిని కలిగించే లఘు చిత్రాలను, లఘు నాటికలను ప్రదర్శించారు. చిన్నచిన్న నీతి కథలను బాలలు చక్కని హావభావాలతో చెప్పి మెప్పించారు. మట్టిబొమ్మల తయారీ, దస్తూరీ తదితర అంశాల్లోనూ చిన్నారులు ప్రతిభ కనబరిచారు. యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు, లోక్‌సత్తా పార్టీ నాయకులు వైడీ రామారావు, దంటు సూర్యారావు తదితర ప్రముఖులు ప్రదర్శనలను సందర్శించారు.
మన సంస్కృతిని పిల్లలకు నేర్పాలి
ఎంతో గొప్పదైన భారతదేశ సంస్కృతిని పిల్ల లకు నేర్పాలని ఆధ్యాత్మికవేత్త ఉమర్ ఆలీషా అన్నారు. పిల్లల పండుగ ముగింపు సభలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ క్రియ ఫౌండేష¯ŒS చిత్తశుద్ధితో చేస్తున్న సేవలు ఆదర్శనీయమన్నారు. మరోఅతి«థిగా ప్రముఖ న్యాయవాది మాదిరెడ్డి సుబ్బారావు మాట్లాడుతూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఒత్తిడి బాలల మానసిక వికాసాన్ని దెబ్బ తీస్తోందన్నారు. విశిష్ట అతిథిగా సినీనటుడు నాగినీడు మాట్లాడుతూ బండెడు పుస్తకాలు మోసే విధానం పోయి ప్రాక్టికల్ విద్యావిధానం వచ్చినప్పుడే బాలల వికాసం జరుగుతుందన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యలతోనైనా మేధావుల వలసలు తగ్గి, వారి విజ్ఞానం మన దేశానికే పరిమితమైతే ముందుకు దూసుకుపోతామన్నారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా పిల్లలను పెంచరాదని సూచించారు. చివరగా ‘తాను కఠిన విల¯ŒSను కాదు– మర్యాద విల¯ŒSనని’ చెప్పి పిల్లలను ఉత్సాహపరిచారు. పిల్లల పండుగలో లఘునాటికలు, నృత్యం, యోగాసనాలు, విచిత్రవేషధారణ తదితర 16 అంశాల్లో సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో ప్రతి విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను, ఇద్దరికి ప్రత్యేక బహుమతులను అందజేశారు. క్రియ ఫౌండేష¯ŒS కార్యదర్శి ఎస్‌ఎస్‌ఆర్ జగన్నాథరావు, సభ్యులు రామకృష్ణరాజు, జగన్నాథరావు, సూర్యప్రకాష్, రచయిత్రి వాడ్రేవు వీరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.