సీపీఎస్ సమస్యపై దేశవ్యాప్త ఆందోళన
Published Tue, Aug 9 2016 8:21 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
-ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు
నెల్లూరు(పొగతోట)
ఉద్యోగ సంఘాలు ఒక్కటై కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) సమస్యపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు పేర్కొన్నారు. మంగళవారం నెల్లూరు ఎన్‌జీఓ హోమ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఎస్ సమస్య దేశవ్యాప్తంగా ఉందన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు చేపడుతున్న కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాంది అవుతుందన్నారు.
ప్రభుత్వ శాఖల్లోని మధ్య స్థాయి ఉద్యోగుల్లో అవినీతి అధికంగా జరుగుతుందన్నారు. ఉద్యోగుల్లో పూర్తి స్థాయిలో మార్పు వస్తేనే ప్రభుత్వాన్ని తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసే అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బాపూజీ, ఎన్‌జీఓ జిల్లా నాయకులు సీహెచ్‌వీఆర్‌సీ శేఖర్‌రావు, వై.రమణారెడ్డి, ఆంజనేయవర్మ, సీహెచ్ సుధాకర్‌రావు, శ్రీకాంత్, శైలజ, రాష్ట్ర మహిళా కో-కన్వీనర్ కరుణమ్మ పాల్గొన్నారు.
Advertisement