ప్రభుత్వం దృష్టికి కరెన్సీ సమస్యలు
- ఎస్పీ ఆకె రవికృష్ణ
నందికొట్కూరు: కరెన్సీ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ తెలిపారు. నగదు కోసం క్యూ నిల్చోలేక గుండెపోటుతో మృతి చెందిన బాలరాజు కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్యాంకుల వద్ద ప్రజలు ఇబ్బందులు పడకుండా మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని బ్యాంక్ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. మహిళలకు, వృద్ధులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని బ్యాంకు అధికారులకు సూచించినట్లు తెలిపారు. బాలరాజు మృతిపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చెప్పారు. ఎస్పీ వెంట డీఎస్పీ సుప్రజ, ఎస్‌ఐ సుబ్రమణ్యం ఉన్నారు.