కాటేసిన కరెంట్
కాటేసిన కరెంట్
Published Tue, Jun 20 2017 11:13 PM | Last Updated on Wed, Sep 5 2018 1:47 PM
విద్యుదాఘాతంతో వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు మృతి
గోస్పాడు: వెలుగులు పంచే విద్యుత్ ప్రవాహం మూడు కుటుంబాల్లో చీకట్లు నింపింది. గోస్పాడు మండలంలో రెండు వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు విద్యుదాఘాతంతో మృత్యుఒడి చేరారు. సాంబవరం గ్రామంలో మంగళవారం ఉదయం విద్యుత్ తీగలు లారీకి తగలడంతో ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామంలో సిమెంట్‌ను దించేందుకు లారీ ముందు భాగానికి విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో లారీ అంతటికి విద్యుత్ ప్రవహించింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ శివయ్య(45) అక్కడికక్కడే మృతి చెందాడు. సిమెంట్ దించేందుకు వచ్చిన కూలీ బోయ మోహన్ (34) కూడా విద్యుదాఘాతానికి గురై స్పృహ కోల్పోయాడు. దీంతో నంద్యాల ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా కోలుకోలేక మృతి చెందాడు. సంఘటనకు కొద్ది నిమిషాల ముందు లారీ డ్రైవర్ కిందకు దిగడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.
మృతి చెందిన లారీ క్లీనర్‌ది శివయ్యది బేతంచెర్ల మండలం సిమెంట్ నగర్. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నంద్యాల ఎంఎస్ నగర్‌కు చెందిన మృతుడు కూలీ బోయ మోహన్‌కు భార్య, కుమార్తె ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ లక్ష్మయ్య తెలిపారు. విద్యుత్ తీగలు కిందకు వేలాడుతున్నాయని పలుమార్లు విద్యుత్ అ«ధికారులకు తెలిపినా పట్టించుకోలేదనే గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
దీబగుంట్లలో కార్పెంటర్ మృతి
దీబగుంట్ల గ్రామానికి చెందిన రంగాచారి (72) చెక్క పని చేస్తూ జీవనం సాగించేవాడు. గ్రామంలో సోమవారం సాయంత్రం ఓ ఇంటి ముందు షెడ్ ఏర్పాటులో భాగంగా రేకులు బిగించే పనికి వెళ్లాడు. అయితే ప్రమాదవశాత్తూ అటువైపుగా వెళ్లిన మెయిన్ లైన్ విద్యుత్ తీగలకు రేకులకు బిగించే రాడ్డు ప్రమాదవశాత్తు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. అపస్మారక స్థితికి చేరుకుని అతడిని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా కోలుకోలేక రాత్రి మృతి చెందాడు.
Advertisement
Advertisement