దళితులపై దాడులకు నిరసనగా 27న ర్యాలీ
దళితులపై దాడులకు నిరసనగా 27న ర్యాలీ
Published Mon, Aug 22 2016 8:25 PM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM
గాంధీనగర్ :
రాష్ట్రంలో, దేశంలో దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ నెల 27న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆల్‌ఇండియా దళితరైట్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు కందుల ఆనందరావు తెలిపారు. బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి అలంకార్ సెంటర్ వరకు మహార్యాలీ, ధర్నా నిర్వహించనున్నట్లు సోమవారం ప్రెస్‌క్లబ్‌లో తెలిపారు. హెచ్‌సీయూలో విద్యార్థి రోహిత్ మరణానికి కారకులైన వీసీ అప్పారావు, ఇతర నిందితుల మీద ఇంతవరకు చర్యలు లేవని విమర్శించారు. గుజరాత్, అమలాపురంలో దళితులపై జరిగిన దాడులు బీజేపీ ఎజెండాలో భాగమేనన్నారు. సంస్కృతి, సంప్రదాయాల పేరుతో బీజేపీ వర్గాలు దాడులకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. ఈ సందర్భంగా పోస్టర్‌ను ఆవిష్కరించారు. దళిత బహుజన ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు, కెవిపీసీఎస్ వ్యవస్థాపకులు పరిశపోగు రాజేష్ పాల్గొన్నారు.
Advertisement