కొట్టుకు పోయిన పంట పొలాలు
డుంబ్రిగుడ: మన్యంలో కురుస్తున్న భారీ వర్షానికి మన్యంలో గిరిజనులు వరి పంటలను వేశారు. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాని మండలంలోని డొమంగి,గుంటగన్నెల, అరమ ,గుంటసీమ ,రగిలిసింగి,కుజ్జభంగి,గేదలబంద, తదితర గ్రామాల్లో సుమారు 40 ఎకరాల్లో వర్షంతో నీటనిగిందని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు వరి పంటలు పంటలు పండించేందుకు వరి నాట్లు వేస్తే చివరికి వర్షం వచ్చి కొట్టుకు పోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఏది ఏమైన గిరిజన రైతులు తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.