
తిరుమలలో పాడైన శ్రీవారి లడ్డూలు
శ్రీవారి భక్తులు ఇష్టపడే లడ్డూ మరో సారి వివాదాస్పదమైంది. భక్తులకు అందించేందుకు తెచ్చిన లడ్డూలు పాడై పోవడంతో టీటీడీ విమర్శల పాలైంది. చివరి నిమిషంలో లడ్డూ నాణ్యత లోపించటం గమనించిన అధికారులు సుమారు 100 ట్రేలను వెనక్కి పంపించారు.
సోమవారం లడ్డూ కౌంటర్ లకు వచ్చిన లడ్డూలు నాణ్యత లోపించి కనిపించాయి. ఇది గుర్తించిన కౌంటర్ అధికారులు వీటి పంపకం ఆపేశారు. విషయం తెలిసిన భక్తులు టీటీడీ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా.. నాణ్యత లోపించిన లడ్డూలపై టీటీడీ స్పందించింది. శ్రీవారి పోటులో తయారయ్యే లడ్డూల నాణ్యత చెడిపోయే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.