కళాకారులకు పుట్టినిల్లు సింహపురి
నెల్లూరు(బారకాసు): కళాకారులకు పుట్టినిల్లు సింహపురి అని 25 కళాసంఘాల గౌరవ అధ్యక్షుడు, రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యాక్షుడు అమరావతి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. డాన్సర్స్, డాన్స్ మాస్టర్స్, ఈవెంట్ ఆర్గనైజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 25వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం రాత్రి నగరంలోని ఇందిరాభవన్‌లో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ జానపద నృత్య కళాకారుడు, డాన్స్ మాస్టర్ నారాయణమూర్తిని ఈ సందర్భంగా సత్కరించారు. అలాగే 8 మంది పేద వృద్ధ కళాకారులకు నగదు పురస్కారం అందజేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన డాన్స్ ఇనిస్టిట్యూట్‌లకు సంబంధించిన నృత్య కళాకారులు ప్రదర్శించిన జానపద, శాస్త్రీయ, వెస్ట్రన్, సినీ నృత్యాలు అందరిని అలరించాయి. కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త బట్టేపాటి నరేంద్రరెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈదూరు భాస్కరయ్య, ప్రముఖ పారిశ్రామికవేత్త పెళ్లకూరు నందకిషోర్‌రెడ్డి, రోటరీ క్లబ్ కొణిదల మునిగిరీష్, ఫిలిం డిస్ట్రిబ్యూటర్ సూరిశెట్టి నరేంద్ర, శ్రీధర్‌రెడ్డి, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, డాన్స్‌మాస్టర్ చిట్టిబాబు, బాబు, పలువురు డ్యాన్స్ మాస్టర్లు నృత్య కళాకారులు తదితరులు పాల్గొన్నారు.