పోలయ్యకు అభినందనలు తెలుపుతున్న మర్రి రాజశేఖర్
సాహస యువకులకు అభినందనల వెల్లువ
Published Fri, Sep 23 2016 8:44 PM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM
* వాగుల్లో చిక్కుకున్న వారిని రక్షించిన యువకులు
* వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, నాయకుల అభినందనలు
అమీన్‌సాహెబ్‌పాలెం (నాదెండ్ల): గురువారం వరదల్లో కొట్టుకుపోయి చెట్టును పట్టుకుని వేలాడుతున్న బాధితుడిని తన ప్రాణాలకు తెగించి రక్షించిన అమీన్‌సాహెబ్‌పాలెం గ్రామానికి చెందిన యువకుడు జంపని పోలయ్యను వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ శుక్రవారం అభినందించారు. రాజశేఖర్ శుక్రవారం అమీన్‌సాహెబ్‌పాలెం గ్రామాన్ని సందర్శించి ముంపు బాధితులు, రైతులను పరామర్శించారు. గురువారం వాగులో కొట్టుకుపోయి తాడిచెట్టును పట్టుకుని వేలాడుతున్న యువకుడిని ప్రాణాలకు తెగించి రక్షించిన అమీన్‌సాహెబ్‌పాలెంకు చెందిన పోలయ్యను అభినందించారు.
రక్షకులు.. వైఎస్సార్ సీపీ అభిమానులు..
వాగులో గల్లంతై తాడిచెట్టును ఆధారంగా చేసుకుని ఒంటరి పోరాటం చేస్తున్న యువకుడికి ధైర్యం చెప్పేందుకు ప్రాణాలకు తెగించి పోలయ్య యువకుడి దగ్గరకు వెళ్లి కాపాడాడు. మరో ఇద్దరూ వాగులో చిక్కుకుపోగా గోవిందపురం గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ అభిమానులైన యువకులు ధైర్యం చేసి రోప్‌ల సహాయంతో వాగుకు ఎదురెళ్లి ఆ ఇద్దరినీ కాపాడారు. వీరి సాహసాన్ని ప్రభుత్వం గుర్తించి ప్రశంసా పత్రాలు అందజేయాలని వైఎస్సార్ సీపీ నాయకులు డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement