ఆర్టీసీ బస్సులో ప్రసవం
ఆర్టీసీ బస్సులో ప్రసవం
Published Mon, Aug 1 2016 11:12 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM
కావలిఅర్బన్:
ఆత్మకూరు నుంచి కావలికి ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సులో సోమవారం గిరిజన మహిళ ప్రసవించింది. మృత శిశువుకు జన్మనిచ్చింది. ఈ సంఘటన స్థానిక బ్రిడ్జి సెంటర్ వద్ద సోమవారం చోటు చేసుకుంది. ఒకటవ పట్టణ పోలీసుల కథనం మేరకు వివరాలు.. జలదంకి మండలం 9వ మైలు గ్రామానికి చెందిన జయంతపు పెంచలయ్య, అంకమ్మ దంపతులు చిత్తు కాగితాలు ఏరుకునేందుకు ఆత్మకూరుకు వెళ్లారు. ఆమె పుట్టిళ్లయిన నడింపల్లికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కారు. 4 నెలల గర్భిణి అయిన అంకమ్మకు మార్గమధ్యలో నొప్పులు వచ్చాయి. నొప్పులు ఎక్కువ కావడంలో బ్రిడ్జి సెంటర్ వద్ద బస్సు దిగుతూ మెట్లపై మృత శిశువును జన్మించింది. ఈ విషయం కనీసం పక్కనే ఉన్న తన భర్తకు కూడా తెలియలేదు. శిశువు బస్సు మెట్లలోపలికి వెళ్లడంతో ఎవరికీ కనబడలేదు. బస్సు దిగిన ఆమె స్పృహకోల్పోయి ఒక్కసారిగా కుప్పకూలింది. భర్త ఆమెను పక్కనే ఉన్న ఏరియా వైద్యశాలలో చేర్పించాడు. అయితే ఆమె జన్మనిచ్చిన మృత శిశువును మాత్రం ప్రయాణికులు గుర్తించలేదు. అనంతరం బస్సు ఎక్కుతున్న ప్రయాణికుల కంటపడింది. ఇదేమిటని పరిశీలించగా అది మృత శిశువుగా గుర్తించారు. బస్సు డ్రైవర్, కండక్టర్లు ఇచ్చిన సమాచారం మేరకు ఆసుపత్రికి చేరుకుని పరిశీలించగా అది అంకమ్మకు జన్మించిందిగా గుర్తించారు. ఆంకమ్మ పరిస్థితి ప్రమాదకరంగా ఉందని వైద్యులు తెలిపారు.
Advertisement
Advertisement