గుంటూరు: గుంటూరు జిల్లాలో ఆర్టీసీ బస్సులోనే ఓ మహిళ ప్రసవించింది. వెల్దుర్తి మండలం శ్రీరాంపురం తండాకు చెందిన అరుణాబాయికి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులతో కలిసి బస్సులో బయలు దేరింది. మార్గమధ్యంలోనే నొప్పులు ఎక్కువ అవడంతో బస్సులోనే ఆడబిడ్డను ప్రసవించింది. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. వారిని ఆసుపత్రికి తరలించారు.